Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్.. కలియుగ కమెడియన్స్

By:  Tupaki Desk   |   20 Nov 2020 7:15 AM GMT
కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్.. కలియుగ కమెడియన్స్
X
గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయం వాడివేడిగా తయారైంది. ఈ హాట్ హాట్ రాజకీయాల పుణ్యమా అని శీతాకాలం చలి అస్సలు పట్టని పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బ పడిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటున్న ఆయన.. బీజేపీని టార్గెట్ చేసుకొని ఉతికి ఆరేస్తున్నారు. కమలనాథులు సైతం ఏ మాత్రం తగ్గకుండా గులాబీ బ్యాచ్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతలంతా కేసీఆర్ ఫ్యామిలీ మీదనే ఫోకస్ చేస్తున్నారు.

తాజాగాఎంపీ అరవింద్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలకు అహంకారం తలకెక్కిందన్న ఆయన.. పరిహారం ఇవ్వొద్దని తాము ఎందుకు అంటామని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం అందజేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ ఎందుకు తెచ్చుకున్నారు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ముందుకు తెచ్చుకున్నారన్నారు.

తమకు టీఆర్ఎస్ తో పోటీ లేదని.. మజ్లిస్ తోనే తలపడతామని అరవింద్ వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ అంటూ.. 45 వర్సెస్ 105 సీట్లు అని కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. పాత బస్తీ పరిధిలో 45 డివిజన్లు ఉండతా.. 105 డివిజన్లు గ్రేటర్ వ్యాప్తంగా ఉండటం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆదాబ్ అనేలా కేసీఆర్ చేస్తాడన్నారు. ప్రజల మధ్యకుపోతే కేటీఆర్ ను కొట్టేట్లు ఉన్నారన్న అరవింద్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..

- బీజేపీకి ఓటేస్తే గుజరాత్‌లాగా అభివృద్ధి చెందుతది మంచిదే కదా. రాష్ట్రపతి పాలనలో ఐటీ హైదరాబాద్ వచ్చింది.

- హైటెక్ సిటీని కంజెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని గబ్బుపట్టించారు.

- కొంగర కళాన్ సభలో ఇంటింటికి నల్లా నీరు ఇస్తామన్నారు.. 95శాతం పూర్తి అయ్యింది అన్నారు. ఏమైంది?

- బాయికాడ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదు. డిస్కంలకు రూ.కోట్లు బకాయిలు పడ్డారు.. ఆ లెక్క చెప్పండి

- దేశంలోని అనేక ప్రాంతాలకు విద్యుద్దీకరణ మోడీ చేస్తే.. రూ.97వేల కోట్ల అప్పును డిస్కంలకు మిగిల్చారు కేసీఆర్

- ఒక మతానికి అమ్ముడుబోయిన వ్యక్తి కేటీఆర్. కరోనాకు ఒక ముస్లిం మహిళకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయించారా?

- జవహర్ నగర్ కంపు జూబ్లీహిల్స్ కు వస్తోంది

- కేసీఆర్ కుటుంబం ప్రెస్ మీట్ లు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ గా మారాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు కలియుగ కమెడియన్స్

- టీఆర్ఎస్ ఎక్కడ ఫ్రేమ్ లో లేదు. యుద్ధం ప్రకటించాలంటే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాలి

- ఫెడరల్ ఫ్రంట్ పని అయిపోయింది... ఇప్పుడు మూడో ప్రపంచ యుద్దం చేస్తా అంటుండు ఏం చేస్తడో చూస్తాం. వాళ్ళు మాట్లాడలేదు... వాళ్ళురారు.. ఈ సమావేశం కాదు

- ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ చేతుల్లో సంస్థగా మారింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌ను బదిలీ చేయమని లేఖ రాస్తాం

- ఎంఐఎం.. టీఆర్ఎస్ లు దోచుకుతింటున్నాయి తప్ప చేసిందేమీ లేదు. మతాలను పక్కన పెట్టి బీజేపీ కి ఓటేయమని కోరుతున్నా