Begin typing your search above and press return to search.
ఇంస్టాగ్రామ్ లో గ్రూప్ చాట్..గ్యాంగ్ రేప్ చేయడం పై డిస్కషన్..లీకైన స్క్రీన్ షాట్స్!
By: Tupaki Desk | 5 May 2020 10:30 PM GMTసోషల్ మీడియా ..ప్రస్తుతం పిల్లల నుండి పండుముసలివారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో మునిగితేలుతున్నారు. అయితే మంచికన్నా చెడుకే ఎక్కువ ప్రభావం ఉండడం చూస్తునే ఉంటాం. స్నేహితులు కలిసి సరదా కబుర్లు చెప్పుకోవడం మామూలే కానీ, ఇలా చెడు కోసమే స్నేహితులు కలవడం కచ్చితంగా సాధారణ విషయం కాదంటోంది ఢిల్లీ టీనేజ్ గర్ల్. తన స్నేహితులతో పాటు మరికొందరు. 'Boys locker room' అనే గ్రూప్ క్రియేట్ చేసుకుని అశ్లీలంగా మాట్లాడుకుంటున్నారట. అందులో భాగంగానే గ్యాంగ్ రేప్ చేయడంపై డిస్కషన్ పెట్టుకుంటున్నారట. ఆ విషయాన్ని స్క్రీన్ షాట్ తీసిన గర్ల్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతున్న ఈ స్క్రీన్ షాట్స్ #BoysLockerRoom హాష్ ట్యాగ్‌తో వైరల్‌గా మారాయి. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే సౌత్ ఢిల్లీలోని కొన్ని ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న కొంతమంది టీనేజ్ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో 'Boys Locker Room' అనే ఓ చాట్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో తమ క్లాస్ మేట్స్, కొంతమంది మహిళల ఫోటోలు షేర్ చేసి వాళ్ల ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్య కామెంట్స్ చేశారు. 'నేను గట్టిగా చెప్తున్నా.. దాన్ని మనం ఈజీగా రేప్ చేయవచ్చు.. ', 'ఆమెకు ఫోన్ చేసి రమ్మను.. నువ్వు చెప్పిన చోటుకు వస్తా.. మన బాయ్స్‌ని కూడా పిలుస్తా.. అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేద్దాం..' అంటూ చెప్పలేని రీతిలో అందులో చాట్ చేశారు.
ఆదివారం ఈ గ్రూపుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివల్ ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. ఆ సోషల్ మీడియా గ్రూపులో ఉన్న బాయ్స్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మహిళా కమిషన్ నుంచి ఢిల్లీ పోలీసులు,ఇన్ స్టాగ్రామ్ కు నోటీసులు పంపించామని.. ఆ బాయ్స్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని స్వాతి మాలివల్ తెలిపారు. సైబర్ సెల్ ఈ వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.
సోమవారం ఓ ప్రముఖ పాఠశాల కూడా దీనిపై సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని కోరిన ఆ స్కూల్ యాజమాన్యం.. ఆ గ్రూపులో మెంబర్ గా ఉన్న ఓ 15 ఏళ్ల విద్యార్థి నంబర్‌ను కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలిపారు. నిందితులపై సెక్షన్ 465,471,469,509,67,67Aల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సౌత్ ఢిల్లీలోని నాలుగు స్కూళ్లకు చెందిన విద్యార్థులే ఇందులో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో కూడా మాట్లాడామని చెప్పారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు