Begin typing your search above and press return to search.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ ను దారుణంగా చంపేసిన ప్రియుడు!

By:  Tupaki Desk   |   18 Nov 2020 12:30 AM GMT
పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ ను దారుణంగా చంపేసిన ప్రియుడు!
X
ప్రేమ ... ఈ మధ్య కాలంలో ఓ ట్రెండ్. యువతీ , యువకులు ఇష్టం వచ్చినట్టు తిరగడం , సినిమాలు , షికార్లు అంటూ తిరిగిన తర్వాత , ఏవో మనస్పర్థలు రాగానే ఇక కలిసి ఉండలేములే అని విడిపోవడం , కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ బంధం కోసం ప్రాధేయ పడటం , కుదిరితే మెప్పించడం లేదా చంపేయడం. ఇది ప్రస్తుత రోజుల్లో ట్రెండ్ అవుతున్న లవ్ కహానిలు. ఆకర్షణ ముసుగు తొలగిపోగానే మనుషుల అసలు రూపాలు బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నువ్వే నా ప్రాణమని దగ్గరికి తీసుకుని ఓదార్చిన చేతులతోనే గొంతు నులిమి చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా ఈ తరహా ఘటనే ముంబయిలో జరిగింది. నాలుగేళ్లు ప్రేమ మోజులో తిరిగి , చివరికి నీ ప్రేమ వద్దు అని అనడంతో చిరాకుతో గొంతు లో కత్తిదించి ప్రాణాలు తీసాడు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంబయికి చెందిన ఓ యువతి , యువకుడుగత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగిపోయారు. ఉన్నారు. కాలేజీ రోజుల నుంచే వారికి పరిచయం. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ నాలుగేళ్లలో వారు తిరగని చోటు అంటూలేదు. కానీ తేజస్ పెద్ద తాగుబోతు. రుచిత ఎన్నిసార్లు అతడితో మందు మాన్పించాలని చూసినా కుదరలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య ఇదే మనస్పర్థలు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పినా ఆ యువకుడి లో మార్పు రాలేదు. కొద్దిరోజల నుంచి అతడికి దూరంగా ఉంటుంది. ఆ అబ్బాయి కాల్స్ కు కూడా సరిగా సమాధానం ఇవ్వడం లేదు. పలుమార్లు ఫోన్ స్విచ్చాఫ్ కూడా చేసేది. దీంతో కోపతో ఊగిపోయాడు. ఆగ్రహంతో పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె మాట్లాడేది లేదు అని చెప్పేయడంతో ఈ క్రమంలో ఈనెల 13న ఒకసారి మాట్లాడాలని ఆమెను పిలిచాడు. ఆ యువతి దాదర్ అనే ప్రాంతానికి చేరుకుంది. రాత్రి 11 గంటల సమయం. ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు.

కానీ అతని గురించి తెలిసిన యువతి వినిపించుకోలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయబోయాడు. ఇది చూసిన రుచిత అక్కడ్నుంచి తప్పించుకోబోయింది. కానీ వెనకనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ను కత్తితో పొడిచాడు. మెడ భాగంలోనూ కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కింద పడి చనిపోయింది. దీనితో అక్కడి నుండి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి విఘతజీవిగా పడిఉన్న యువతిని ను చూసి పోలీసులకు తెలిపాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లగా జేబులో ఉన్న కత్తితో పొడుచుకుని తనను తాను గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.