Begin typing your search above and press return to search.
తెలంగాణలో బాలికపై క్రూరంగా వ్యవహరించిన కుర్రాడు
By: Tupaki Desk | 6 Oct 2020 9:10 AM GMTదేశ వ్యాప్తంతో కామవాంఛతో చోటు చేసుకుంటున్న దారుణాలు అన్ని ఇన్ని కావు. ఓవైపు యూపీలోని హథ్రస్ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారితే.. దానికి దగ్గరగా ఉండే ఆరాచక ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. దారుణ ఘటన జరిగిన పదిహేడు రోజుల తర్వాత ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే. పన్నెండేళ్ల బాలికపై కన్నేసిన ఒక యువకుడు పాల్పడిన దారుణం తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
అన్నా అంటున్నా వినకుండా కామంతో బుసలు కొట్టిన ఆ కుర్రాడు విచక్షణ కోల్పోయి కామ పిశాచిలా మారి.. అభం శుభం తెలియని బాలిక మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం వింటే ఇంత క్రూరమా? అన్న క్వశ్చన్ తలెత్తక మానదు. ఖమ్మం నగరానికి సమీపంలోని మండలానికి చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు. కరోనా కారణంగా ఉపాధి పోవటంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పన్నెండేళ్ల తమ రెండో కుమార్తెను ఖమ్మంలోని ఒకరింట్లో పనికి కుదిర్చారు. ఇంట్లోనే ఉంటూ పని చేసేది.
ఆ ఇంటి యజమాని కుమారుడు సెప్టెంబరు 18న ఉదయం ఆరు గంటల వేళలో ఆమె ఉండే గదిలోకి వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయంతో హడలిపోయిన బాలిక.. అన్నా.. వదులు అన్నా ఊరుకోలేదు. తన కోరిక కాదని నెట్టేసిందన్న కోపంతో పెట్రోలో ఆమె మీద పోసి నిప్పు అంటించాడు. తానే రక్షిస్తున్నట్లుగా చేసి ఆసుపత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో నరకయాతనను అనుభవిస్తోంది.
ప్రమాదవశాత్తు నిప్పు అంటిందని బాలిక కుటుంబానికి సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వారు రంగంలోకి దిగి బాలికను వివరాలు అడిగిన తర్వాతే అసలు దారుణం బయటకు వచ్చింది. అయితే.. ఈ వ్యవహారంలో వైద్యుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏదైనా అత్యవసర కేసుకు చికిత్స అందించే విషయంలో ఆలస్యం చేయకూడదు కానీ.. చికిత్స అందిస్తున్న తర్వాత.. బాలిక పరిస్థితి విషమంగా ఉన్న తర్వాత కూడా పోలీసులకు ఆసుపత్రి వర్గాలు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న ఖమ్మం స్పెషల్ మొబైల్ జడ్జి జస్టిస్ ఉషశ్రీ.. పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసు నమోదు చేశారు.