Begin typing your search above and press return to search.
రైల్వే బ్రిడ్జి కింద మైనర్ బాలిక శవం ... ఎందుకు చంపేశారో తెలిస్తే షాక్ అవుతారు !
By: Tupaki Desk | 22 July 2021 12:34 PM GMTఅమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలకు, దాడులకు యూపీ అడ్డాగా మారింది. తాజాగా యూపీలో మరో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక శవం రోజంతా రైల్వే బ్రిడ్జికి వ్రేలాడుతూనే ఉంది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి శవం రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతుంటే, ఆ శవాన్ని చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారి గురించి తెలిసి షాక్ కు గురయ్యారు. ఆమె తాత, మామలు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే .. హత్యకు గురైన ఆ మైనర్ బాలిక ఇటీవలె తన తల్లితో కలిసి యూపీలోని డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, వచ్చిన నాటి నుంచి ఆ బాలిక పద్ధతి ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. ఆమె ధరిస్తున్న దుస్తులు, ప్రవర్తన ఆ బాలిక తాతకు, మామయ్యలకు ఆగ్రహం తెప్పించాయి. అలాంటి బట్టలు వేసుకోవద్దని వారు ఆ బాలికను హెచ్చరించారు. అయితే ఆ బాలిక వారి మాటలను పట్టించుకోలేదు. రెండ్రోజుల క్రితం ఈ విషయమై బాలిక, ఆమె తాత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాలిక తనకు ఎదురుతిరగడంతో ఆగ్రహానికి గురైన ఆమె తాత క్షణికావేశంలో ఆమె తలపై ఇనుప రాడ్ తో కొట్టాడు.
దీనితో, బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో భయపడిన తాత, మామయ్యలు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్ తో తీవ్రంగా కొట్టాడు. దీనితో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక కిందపడటంతో గాయాలయ్యాలయ్యాయని, దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తల్లికి చెప్పారు.
మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక చనిపోవడంతో మృతదేహన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.