Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఏర్పాటు కు బలం లేదంటూ సామెత ను గుర్తు కు తెస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   11 Nov 2019 4:28 AM GMT
ప్రభుత్వ ఏర్పాటు కు బలం లేదంటూ సామెత ను గుర్తు కు తెస్తున్న బీజేపీ
X
నేను నాశన మైనా ఫర్లేదు.. నువ్వు మాత్రం బాగు పడకూడదన్నట్లు గా ఉంది బీజేపీ పరిస్థితి చూస్తుంటే. ప్రభుత్వ ఏర్పాటు కు తగినంత బలం లేకున్నా.. ఎదుటి పార్టీని ముక్కలు చెక్కలు చేసి.. అరువు గా తెచ్చుకున్న బలం తో కర్ణాటక లో అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న కమల నాథలుకు.. మహారాష్ట్ర లో మాత్రం అలాంటి ప్లాన్లు వర్క్ వుట్ అయినట్లు గా కనిపించ లేదట్టుంది.

అందుకేనే మో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ స్వయంగా కోరినా.. తమకు సర్కారును ఏర్పాటు చేసేంత బలం లేదని చెబుతూ చేతు లెత్తేసిన తీరు ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మిత్ర పక్షాలుగా ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి అవసరమైన బలాన్ని ప్రజలు ఇచ్చినా.. పవర్ ను పంచుకునే విషయంలో వచ్చిన పేచీ.. ప్రభుత్వ ఏర్పాటు కు ప్రతి బంధకంగా మారింది.

దీంతో.. ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇన్ని రోజులు అవుతున్నా.. మహా రాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటివేళ.. గవర్నర్ కోషియార్ ఒక అడుగు ముందుకేసి.. సీట్ల పరంగా అత్యధిక స్థానాలు సొంతం చేసుకున్న బీజేపీ ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

అయితే.. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ లేదని.. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమ ని చేతు లెత్తేస్తూ సంచలన ప్రకటన చేసింది. దీంతో.. మహా రాష్ట్ర రాజకీయా ల్లో సరి కొత్త సమీకరణాలకు తెర తీసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. శివసేన తో కలిసి అధికారాన్ని పంచు కోవటానికి ఎన్సీపీ.. కాంగ్రెస్ లు ముందుకు వస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్న గా మారింది. అదే జరిగితే.. సుదీర్ఘ కాలం బీజేపీ కి మిత్రుడి గా ఉన్న శివసేన తో ఆ పార్టీ కి ఉన్న బంధం తెగిపోయినట్లే.