Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తున్న బీజేపీ అధికార రాష్ట్రం!

By:  Tupaki Desk   |   10 March 2021 12:30 PM GMT
తెలుగు రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తున్న బీజేపీ అధికార రాష్ట్రం!
X
బీజేపీ పాలిత క‌ర్ణాట‌క రాష్ట్రం చేస్తున్న తెర‌చాటు జ‌ల చౌర్యం రెండు తెలుగు రాష్ట్రాల‌కు శ‌రాఘాతంగా ప‌రిణ‌మిస్తోందా? విచ్చ‌ల‌విడిగా దోచేస్తున్న జ‌ల‌చౌర్యంతో వ‌చ్చే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాలా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని బీజే పీ ప్ర‌భుత్వం దొంగ‌చాటుగా నీటి చౌర్యానికి పావులు క‌దుపుతోంది. ప్ర‌ధానంగా ఇటు శ్రీశైలం, తుంగ‌భద్ర ప్రాజెక్టులు రెండు కూడా ఎఫెక్ట్ కావ‌డంతోపాటు... రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటి స‌మ‌స్య‌ల‌తో అల్లా డే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

క‌ర్ణాట‌క కుయుక్తులు ఇవే..
క‌ర్ణాట‌క‌లో తుంగ‌, భ‌ద్ర రెండు న‌దులు వేర్వేరుగా ప్ర‌వ‌హిస్థాయి. అదేస‌మ‌యంలో ఇదే రాష్ట్రంలోని షిమో గా జిల్లాలోని `కూడ్లి` ప్రాంతంలో క‌లిసిపోయి.. తుంగ‌భ‌ద్ర‌గా ప్ర‌వ‌హిస్తుంది. ఈ ప్ర‌వాహం.. తెలంగాణ‌లోకి.. త‌ద్వారా.. ఏపీలోకి(క‌ర్నూలు) ప్ర‌వ‌హిస్తుంది. దీనివ‌ల్ల .. తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఏపీలోని క‌ర్నూ లు స‌హా కొన్ని సీమ ప్రాంతాల్లో సాగు సాగుతోంది. అయితే.. క‌ర్ణాట‌క‌లోని బీజేపీ స‌ర్కారు మాత్రం.. తుంగ‌-భ‌ద్ర న‌దుల జ‌లాల‌ను విచ్చ‌ల‌విడిగా అక్ర‌మంగా వినియోగించుకుంటోంద‌ని నిపుణులు చెబుతున్నారు.. అంటే... ఇప్ప‌టికే కేటాయించిన నీటి క‌న్నా భ‌ద్ర న‌ది నుంచి పూర్తిగా నీటిని వాడేశారు. దీనికి ఎగువ‌న‌.. ఎగువ భ‌ద్ర ప్రాజెక్టును నిర్మించి.. న‌నీటిని ఎత్తిపోయాల‌నేది ప్లాన్‌.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు న‌ష్టం
ఈ క్ర‌మంలో భ‌ద్ర న‌ది నుంచి నీటిని వాడేసిన ద‌రిమిలా.. మిగిలిన తుంగ న‌ది నుంచి నీటిని భ‌ద్ర న‌దికి మ‌ళ్లించాల‌ని ప‌క్కా వ్యూహం. దీంతో తుంగా న‌ది నుంచి నీటి ప్ర‌వాహం త‌గ్గిపోతుంది. ఇప్ప‌టికే భ‌ద్ర‌లో వాట‌ర్ లేదు. ఫ‌లితంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు నీటి ప్ర‌భావం త‌గ్గుతుంది. అంటే ఇది ఒక‌ర‌కంగా.. నీటి చౌర్య‌మే! దీంతో..రెండు రాష్ట్రాల‌కు కీల‌క‌మైన‌ శ్రీశైలం ప్రాజెక్టుపై తీవ్ర‌ ప్ర‌భావం ప‌డుతుంది. అంతేకాకుండా.. తుంగ ‌భ‌ద్ర ప్రాజెక్టు ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల‌కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క‌ర్నూలు జిల్లాల‌కు అపార‌ న‌ష్టం వాటిల్ల‌డం ఖాయమ‌ని నిపుణుల మాట‌.

ఇప్ప‌టికే ఆల‌మ‌ట్టి ఎత్తు పెంచారు. చిన్న‌చిన్న డ్యామ్‌ల‌ను క‌ట్టి కృష్ణావాట‌ర్ లాగేస్తున్నారు.. కృష్ణాపై మ‌హారాష్ట్ర‌లోనూ చౌర్యం జ‌రుగుతోంది. అదేవిధంగా గోదావ‌రి నీటిని బాబ్లీ ప్రాజెక్టు ద్వారా లాగేస్తున్నారు. ఇలా .. రెండు తెలుగు రాష్ట్రాల‌కు బీజేపీ పాలిత క‌ర్ణాట‌క రాష్ట్రం తీవ్ర అన్యాయం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌లు ఏం చేస్తున్నారు? క‌నీసం ప్ర‌శ్నించ‌లేరా?

రెండు రాష్ట్రాల్లోనూ అధికారం కావాల‌ని కోరుకుంటున్న బీజేపీ నాయ‌కులు.. పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ నేత‌లు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మాత్రం మౌనంగా ఉండ‌డం రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు కూడా దారితీస్తోంది.