Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంః బీజేపీకి ఒక్క సీటు కూడా రాద‌ట‌.. సీఎం ఆయ‌నే?

By:  Tupaki Desk   |   10 April 2021 4:30 PM GMT
సంచ‌ల‌నంః బీజేపీకి ఒక్క సీటు కూడా రాద‌ట‌.. సీఎం ఆయ‌నే?
X
త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. విజ‌యం కోసం పార్టీలు సర్వ‌శ‌క్తులూ ఒడ్డాయి. అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ ప్ర‌‌యోగించాయి. మ‌రి, ఓట‌రు ఎవ‌రి వైపు నిలిచాడు? ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జ‌రిగింది. మే 2న ఫలితాలు వెల్ల‌డి కానున్నాయి. అయితే.. రాబోయే ఫ‌లితాలు ఇవేనంటూ స‌ర్వే సంస్థ‌లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌నే రిపీట్ చేసిన ‘ఐ బ్యాక్’ సంస్థ.. అధికారికంగా వెలువడే రిజల్ట్ కూడా ఇదేనని ఘంటాపథంగా చెబుతోంది. కావాలంటే ఇంకో సీటు అదనంగా లెక్కేసుకోండని చెబుతోంది.

ఎన్నిక‌ల‌కు చాలా రోజుల ముందుగానే ఐ బ్యాక్ సంస్థ స‌ర్వే చేప‌ట్టింది. రాష్ట్రంలోని 234 స్థానాల్లో డీఎంకే ఏకంగా 180 స్థానాలు గెలుచుకుంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిన త‌ర్వాత మ‌రోసారి స‌ర్వే ఫలితాలు వెల్ల‌డించిన సంస్థ‌.. 180కి పైగానే స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చి చెబుతోంది. స‌ర్వే సంస్థ మాట‌లు అంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు అనుకుంటే.. రాజ‌కీయ పార్టీల్లోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు హ్యాట్రిక్ సాధిస్తామ‌ని ప‌ళ‌ని స్వామి చెప్పిన‌ప్ప‌టికీ.. పోలింగ్ త‌ర్వాత అస‌లు సీన్ అర్థ‌మైంద‌ని అంటున్నారు. అన్నాడీఎంకే ఓడిపోతుంద‌ని, ప‌లువురు మంత్రులు కూడా గెలిచే ఛాన్స్ లేద‌ని స‌మాచారం అందిన‌ట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోవ‌డ‌మే కాకుండా.. చాలా త‌క్కువ సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇక‌, బీజేపీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. కేంద్రంలో అధికార పార్టీగా దేశంలో హ‌వా కొన‌సాగిస్తున్న పార్టీ.. ద‌క్షిణాదిన పాగా వేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావించింది. క‌రుణా నిధి, జ‌య‌ల‌లిత వంటి ఉద్ధండులు లేని సంధికాలాన్ని వినియోగించుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లోనూ చ‌రిత్ర పున‌రావృతం కాబోతోంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఒక్క‌టంటే ఒక్క సీటుగా కూడా బీజేపీకి రాద‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ పార్టీ కూడా ఏ మాత్రం ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నారు. శ‌ర‌త్ కుమార్ పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన క‌మ‌ల్ కు అత్య‌ల్ప సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వే రిపోర్టు. ఇదిలాఉంటే.. గెలుపును డీఎంకే అధినేత ఖాయం చేసుకున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ధాన నేత‌ల‌తో స‌మావేశ‌మై.. మంత్రులు, శాఖ‌ల కేటాయింపు అంశంపైనా సూచాయ‌గా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి, అంతిమంగా ఫ‌లితాలు ఎలా రాబోతున్నాయో చూడాల్సి ఉంది.