Begin typing your search above and press return to search.
టెస్టు డ్రైవ్ పేరుతో బైక్ ఎత్తుకెళ్లిపోయాడు.. అసలు ట్విస్టు ఏమంటే?
By: Tupaki Desk | 13 Nov 2020 5:15 AM GMTఆన్ లైన్ లో ఇచ్చిన ప్రకటనను చూసి.. బైక్ కొంటానని.. టెస్టు డ్రైవ్ చేస్తానని చెప్పి.. బైక్ ను చోరీ చేసిన సిత్రమైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అయితే.. చోరీకి పాల్పడిన వ్యక్తి అతి తెలివితేటల్ని చూసిన పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ క్రైంలో సిత్రమైన ట్విస్టులు ఉండటం గమనార్హం. కోల్ కతాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కేసు విచారణ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణాలకు చెందిన గౌరంగ అనే వ్యక్తి అతి తెలివి చాలా ఎక్కువ. కష్టపడకుండా బాగా సంపాదించాలన్న ఆలోచన ఎక్కువ. అందుకే.. భారీ ప్లాన్ వేశాడు. రిక్షా నడిపే కార్మికుడ్ని తన దగ్గర పనికి పెట్టుకున్న ఆ వ్యక్తి.. మాటల మధ్యన తెలివిగా అతని ఫోన్లోని సిమ్ కార్డును చోరీ చేశాడు.
దాంతో.. ఆన్ లైన్ ప్రకటనల్ని చూసి..బైకు అమ్ముతానని చెప్పిన డాక్టర్ కు ఫోన్ చేశాడు. దొంగలించిన సిమ్ తో ఫోన్ చేసిన అతడు.. బైక్ కొంటానని నమ్మించి..ఒక ప్రదేశానికి పిలిపించాడు. టెస్టు డ్రైవ్ పేరుతో బండిని తీసుకున్న అతడు.. పత్తా లేకుండా పోయాడు. దీంతో సదరు వైద్యుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు సాంకేతికత సాయంతో నిందితుడ్ని పట్టుకున్నారు.
అయితే..ఇతన్ని పట్టుకునే క్రమంలో రిక్షా నడిపే వ్యక్తి సీన్లోకి వచ్చాడు. అతడి సిమ్ కొట్టేసి.. చోరీ చేసిన విషయాన్ని గ్రహించిన పోలీసులు మరింత లోతుగా విషయాన్ని పరిశీలించగా.. ఇతరుల సిమ్ తో మోసం చేస్తే.. దొరికిపోనన్న ఉద్దేశంతో నిందితుడు సిమ్ చోరీ ప్లాన్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఇతగాడి అతి తెలివికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి.. బైక్ ను రికవరీ చేశారు.