Begin typing your search above and press return to search.
బిహార్ కూటమి లెక్కలు ఒక కొలిక్కి వచ్చాయి
By: Tupaki Desk | 4 Oct 2020 5:30 AM GMTగడిచిన రెండు దఫాలుగా బిహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీశ్ కుమార్.. తాజాగా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. మోడీని వ్యతిరేకించిన ఆయన.. తర్వాతి కాలంలో కమలనాథులతో కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పాత మిత్రుడు ఆర్జేడీని పక్కన పెట్టేవారు. మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు షురూ అయ్యాయి.
దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అధికార కూటమికి చెక్ పెట్టాలన్న కసితో పని చేస్తున్నారు ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విపక్ష కూటమిని సెట్ చేశారు. అందులో ఆర్జేడీ కీలక భూమిక పోషిస్తుంటే.. కాంగ్రెస్ రెండో పెద్ద పార్టీగా ఉంది. ఆ కూటమిలో సీపీఐ.. సీపీఎంతో పాటు సీపీఐ(ఎంఎల్) ను కూడా భాగస్వాముల్ని చేసుకున్నారు.
తాజాగా తేలిన లెక్కల ప్రకారం బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు.. సీపీఐ(ఎంఎల్) కు 19సీట్లు.. సీపీఐకు ఆరు.. సీపీఎంకు నాలుగు సీట్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బిహార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ బింద్ తాజాగా తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీలో చేరారు. దీంతో.. ఆర్జేడీ మరింత పుంజుకున్నట్లుగా చెప్పాలి. మరి.. ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.