Begin typing your search above and press return to search.
జగన్ మీద అతి పెద్ద విమర్శ...?
By: Tupaki Desk | 1 Nov 2021 1:30 AM GMTజగన్ ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాలన కూడా పూర్తి అవుతోంది. అంటే సగం అధికారం అయిపోవస్తోంది అన్న మాట. మరి ఈ రెండున్నరేళ్లలో జగన్ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. అయితే ఆయన కాలు బయటకు పెట్టకపోవడం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం మీద అటు జనాలలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా విమర్శలు ఉన్నాయి. మొదటి ఏడాది పాలన మీద పట్టు సాధించేందుకు జగన్ చాలా టైమ్ ఆఫీస్ లో గడిపారు అంటే అర్ధం ఉంది. ఆ తరువాత అయినా ఆయన రావచ్చు కదా అన్నదే అందరి మాట. అయితే రెండేళ్ల పాటు కరోనా ఉంది అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న సర్దుబాటు మాట.
కరోనా ఉన్న సమయంలోనే జగన్ కొన్ని పర్యటనలను చేయాల్సి ఉందని అంటున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేసీయార్ కరోనా రెండవ దశ టైమ్ లో ఆసుపత్రులను సందర్శించి రోగులను పరామర్శించారు. అదే విధంగా అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. మరి ఆ సమయంలో టీడీపీ నుంచి జగన్ మీద విమర్శలు వచ్చాయి. జగన్ ఏపీలో కరోనా వేళ జనాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి ఫీల్డ్ విజిట్స్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ జగన్ మాత్రం చేయలేదు.
దాంతో టీడీపీ అయితే జగన్ని విమర్శించడానికి తాడేపల్లి కొంప నుంచి బయటకు రారు అంటూ మాటల తూటలు పేల్చేది. రాజ ప్రాసాదం నుంచి బయటకు వచ్చి చూస్తే అన్నీ కనిపిస్తాయి. లోపల కూర్చుని అంతా బాగుందనుకుంటే కుదరదు అని కూడా తమ్ముళ్ళు తరచూ హెచ్చరించేవారు. ఇక బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా ఈ మధ్య ఇవే విమర్శలు చేస్తున్నారు. జగన్ బయటకు రా అని ఆయన కోరుతున్నారు. టోటల్ గా చూస్తే విపక్షాలన్నీ కూడా జగన్ బయటకు రాకపోవడాన్ని బాగా తప్పుపడుతున్నాయి.
ఇంకో వైపు పార్టీ పరిస్థితి ఎలా ఉందో, ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి జగన్ టూర్లు చేస్తే బాగుంటుంది అన్నది వైసీపీలో కూడా వినిపిస్తున్న మాట. ఇక తిరుపతి బై పోల్ వేళ జగన్ బహిరంగ సభ ఉంటుంది అనుకుంటే అది రద్దు అయింది. బద్వేల్ లో సభ పెడతారు అనుకుంటే అదీ జరగలేదు. మొత్తానికి పదేళ్ళ పాటు జనంలో ఉంటూ వారి మధ్యనే కలియదిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారన్న కామెంట్స్ జనం నుంచి కూడా వస్తున్నాయి. జగన్ మాత్రం రచ్చ బండ పేరిట జిల్లాల టూర్లు చేస్తాను అంటూ గత రెండేళ్ళుగా ముహూర్తాలు చూసుకుంటూ గడుపుతున్నారు అంటున్నారు.. ఇక మీదట అయినా ఆయన కాలు కదపకపోతే రాజకీయంగా జరిగే నష్టానికి ఆయనే కారణం అవుతారన్న మాట పార్టీ బయటా లోపలా గట్టిగానే వినిపిస్తోంది మరి.