Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు భారీ ఎదురు దెబ్బ ..ఏంటంటే ?

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:41 AM GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు భారీ ఎదురు దెబ్బ ..ఏంటంటే ?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ హౌస్‌ లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు అందుకు ఆమోదం తెలిపారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ సెనేట్‌లో విచారణ ఎదుర్కొనబోతున్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ట్రంప్‌ ను పదవి నుంచి తొలగించాలని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం చేసింది. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినందునే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినట్లు ప్రతిపక్ష డెమొక్రాటిక్‌ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రంప్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశద్రోహానికి పాల్పడ్డారని డెమొక్రాటిక్‌ పార్టీ తన ప్రకటన లో వివరించింది. ఇప్పటికే ట్రంప్‌ పై అభిశంసన అభియోగాలకు న్యాయవ్యవహారాల సభా సంఘం ఇటీవల ఆమోదముద్ర వేసింది. సెనేట్ ఆమోదముద్రతో అమెరికన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది.

ఇకపోతే , అమెరికాలో అభిశంసన ఎదుర్కొంటున్న అధ్యక్షుల్లో ట్రంప్‌ మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం. గతంలో రిచర్డ్‌ నిక్సన్‌, బిల్‌ క్లింటన్‌లు ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. అయితే , సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ సభ్యులు అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను దోషి అని తేల్చితే, అయన అధ్యక్ష పదవిని కోల్పోతారు. అయితే ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లదే ఆధిపత్యం కాబట్టి అధ్యక్షుడు పదవి కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 197 మంది ఓట్లు వచ్చాయి.