Begin typing your search above and press return to search.
అత్యుత్తమ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్
By: Tupaki Desk | 10 May 2019 1:30 AM GMTమనకు అందుబాటులో ఉన్నదాని కంటే ప్రపంచం ఎపుడూ గొప్పగా కనిపిస్తుంది. అందుకే కొన్ని అద్భుతాలు ఇతరులు చెబితేనే తెలుస్తాయి. అలాంటి నిజం ఒకటి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గురించి ఈరోజు తెలుస్తోంది. ప్రపంచంలో ఉన్న 10 అత్యుత్తమ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన - ఫుడ్ - షాపింగ్ ఫెసిలిటీస్ - ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చారు. వీటి ప్రమాణాల ఆధారంగా 2019 ప్రపంచ అత్యుత్తమ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలలో హైదరాబాద్ విమానాశ్రయం 8 వ స్థానం దక్కించుకుంది. మనం గొప్పగా చెప్పుకునే పాశ్చాత్య దేశాలైన అమెరికా - యూరప్ లో మొదటి రెండు స్థానాల్లో లేవు. ఒకటి - రెండు స్థానాల్లోనూ ఆసియా దేశాలే ఉన్నాయి. ఖతార్ (హమాద్ ఎయిర్ పోర్ట్) - జపాన్ (టోక్యో) ఎయిర్ పోర్టులు వరుసగా ఫస్ట్ - సెకండ్ ర్యాంకింగ్ లు పొందాయి. అత్యంత చెత్త ఎయిర్ పోర్టుల్లో లండన్ లోని గ్యాట్ విక్ ఎయిర్ పోర్టు మొదటి స్థానంలోనూ - కెనడాలోని టోరంటో ఎయిర్ పోర్ట్ రెండు స్థానంలోనూ ఉండటం గమనార్హం.
టాప్ 10 ఎయిర్ పోర్టులు
1. హమాద్ - ఖతార్
2. టోక్యో - జపాన్
3. ఏథెన్స్ - గ్రీస్
4. అఫోన్సో ఫెనా - బ్రెజిల్
5. గడాయిన్స్క్ - పోలండ్
6. షెరెమెట్యవో - రష్యా
7. చాంగి - సింగపూర్
8. హైదరాబాద్ - ఇండియా
9. టెనెరిఫి నార్త్ - స్పెయిన్
10. విరాకొపోస్ - బ్రెజిల్
టాప్ 10 ఎయిర్ లైన్స్
1. ఖతార్ ఎయిర్ వేస్
2. అమెరికన్ ఎయిర్ లైన్స్
3. ఏరో మెక్సికో
4. ఎస్ ఎఎస్ స్కాండినేవియన్
5. ఖాంటాస్,
6. లాటమ్ ఎయిర్ లైన్స్
7. వెస్ట్ జెట్
8. లక్స్ ఎయిర్
9. ఆస్ట్రియన్ ఎయిన్ లైన్స్
10. ఎమిరేట్స్
టాప్ 10 ఎయిర్ పోర్టులు
1. హమాద్ - ఖతార్
2. టోక్యో - జపాన్
3. ఏథెన్స్ - గ్రీస్
4. అఫోన్సో ఫెనా - బ్రెజిల్
5. గడాయిన్స్క్ - పోలండ్
6. షెరెమెట్యవో - రష్యా
7. చాంగి - సింగపూర్
8. హైదరాబాద్ - ఇండియా
9. టెనెరిఫి నార్త్ - స్పెయిన్
10. విరాకొపోస్ - బ్రెజిల్
టాప్ 10 ఎయిర్ లైన్స్
1. ఖతార్ ఎయిర్ వేస్
2. అమెరికన్ ఎయిర్ లైన్స్
3. ఏరో మెక్సికో
4. ఎస్ ఎఎస్ స్కాండినేవియన్
5. ఖాంటాస్,
6. లాటమ్ ఎయిర్ లైన్స్
7. వెస్ట్ జెట్
8. లక్స్ ఎయిర్
9. ఆస్ట్రియన్ ఎయిన్ లైన్స్
10. ఎమిరేట్స్