Begin typing your search above and press return to search.

గాడిద పాలలో అందాన్ని పెంచే గుణం..స్నానం చేస్తే ముసలితనం రాదట!

By:  Tupaki Desk   |   25 Feb 2021 2:30 AM GMT
గాడిద పాలలో అందాన్ని పెంచే గుణం..స్నానం చేస్తే ముసలితనం రాదట!
X
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు..కడివెడైననేమి ఖరము పాలు..భక్తి కలుగు కూడు పట్టెడైననుచాలు..విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అందరికి దాదాపుగా గుర్తుండే ఉంటుంది. కానీ ఆవు పాలు కంటే కూడా ఖరం పాలు ఇంకా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖరము పాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలతో పాటు అందాన్ని పెంచే గుణం కూడా ఉందట. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది మంచి ప్రత్యమ్నాయం అని చెప్తున్నారు.

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని కణాలను రక్షించడంలోకీలక పాత్రను పోషిస్తాయి. పొగ, రేడియేషన్ వల్ల మన శరీరం లోకి ఫ్రీ రాడికల్ సెల్స్ ప్రవేశించి ఆరోగ్యం గా ఉన్న కణాలనుపాడు చేస్తాయి. దీంతో మనం ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాము. ఇటువంటి పరిస్థితి రాకుండా చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్‌దే కీలక పాత్ర. శరీరం లోని కణాలనురక్షిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ గాడిద పాల లో పుష్కలం గా ఉంటాయి. గాడిద తాగడం మంచిదని ద‌శాబ్దాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు ఇవి తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు

ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలను తాగించార‌ట‌. అప్పటి నుంచి వీటి పెంపకం, పాల విక్రయం పెరుగుతూ వస్తుంది. అయితే ఒక్కొక్కటి రోజుకు 4 కప్పుల (1 లీటరు) పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాడు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు ఉంటాయట. అవేంటంటే.. గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.

గాడిద పాలను లీటర్ రూ.6,000నుండి 7000 వరకు అమ్ముతున్నారు. ఈజిప్టు లో ఒకప్పటి అందాల రాణి క్లియోపాత్రా గాడిద పాలతో నే స్నానం చేసేదట. ఎందుకంటే ఆ పాలు ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. ఈ హాలరీ గాడిదలు, గుజరాత్‌ లోని సౌరాష్ట్రలో ఎక్కువగా ఉంటాయి. ఈ గాడిదలు గుర్రాల కంటే చిన్నగా ఉంటాయి. ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.
దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.
ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, బలమైన ఎముకలకు కారణమవుతుంది. వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి. గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.

గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షించి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. వీటిలోని ప్రోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్ ‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు. ఇక గాడిద పాల నుంచి చీజ్ ను కూడా తయారు చేస్తారు. అయితే ఈ చీజ్ చాలా తక్కువుగా దొరుకుతుంది.కిలో చీజ్ ధర సుమారు రూ.80 వేల వరకు ఉంటుందట.