Begin typing your search above and press return to search.
టీ20 వరల్డ్‌కప్ : ఆ 15 మంది వీరే .. మెంటార్‌గా ధోనీ
By: Tupaki Desk | 9 Sep 2021 5:30 AM GMTప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టుకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దిశానిర్దేశం చేయబోతున్నాడు. క్రికెట్ ప్రపంచంలోనే తిరుగులేని కెప్టెన్ గా అరుదైన ఘనతలు సాధించిన ధోనీ.. ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకి టీ20 వరల్డ్ కప్ లో మెంటార్ గా సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టుని బీసీసీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్ కప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి చోటు దక్కకపోగా.. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ కి మొండిచేయి ఎదురైంది. అయితే, 15 మందితో కూడిన ఈ టీ20 వరల్డ్ కప్ టీమ్ కి మెంటార్‌గా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని బీసీసీఐ నియమించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనీ.. కేవలం ఐపీఎల్ లో మాత్రమే మ్యాచ్ లు ఆడుతున్నాడు. అయితే.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా భారత్ జట్టుని విజేతగా నిలిపిన ధోనీ అనుభవాన్ని ఈ టీ20 వరల్డ్ కప్ కి వినియోగించుకోవాలని బీసీసీఐ ఆశించింది. ఈ మేరకు ధోనీని మెంటార్ గా ఉండాలని బీసీసీఐ సెక్రటరీ జై షా రిక్వెస్ట్ చేయగా.. ధోనీ కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఐపీఎల్ 2021 కోసం ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ధోనీతో నేను మాట్లాడాను. టీ20 వరల్డ్ కప్ టీమ్ కి మెంటార్ గా ఉండేందుకు అతను ఒప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐలోని నా కొలీగ్స్ తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా ఈ విషయం చెప్పాను. వాళ్లు కూడా అందుకు అంగీకరించారు అని జై షా తెలిపారు. ధోనీ ఓ టీమ్ కి మెంటార్ గా ఉండబోతుండటం ఇదే తొలిసారి.
టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ , స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్
పొట్టి క్రికెట్ లో రోహిత్ శర్మ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. 111 టీ 20 ల్లో 2864 పరుగులు చేశాడు. 32.54 సగటు, 138.96 స్ట్రైక్ రేట్‌తో 22 అర్ధ సెంచరీలతోపాటు నాలుగు సెంచరీలు కూడా చేశాడు. ఐపీఎల్ ఐదు ట్రోఫిలు ఎగరేసుకుపోయిన రోహిత్ సలహాలు కోహ్లీకి ఎంతైనా అవసరం. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది దాదాపు కేఎల్ రాహుల్ నే. 49 టీ-20ల్లో 1557 పరుగులు చేశాడు రాహుల్. 39.9 యావరేజ్. 142.2 స్ట్రైక్ రేట్ తో 2 సెంతరీలు..12 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్ ఇచ్చే కీలక భాగస్వామ్యాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయ్.
సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లండ్ పై టీ-20 అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంక గడ్డపై కూడా అతను రాణించాడు. అతను అంతర్జాతీయ స్థాయిలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 169.51 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఐపీఎల్, దేశీయ క్రికెట్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. ఇక, ఐపీఎల్ సూర్య కుమార్ యాదవ్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇక, ధనాధన్ క్రికెట్ కు రిషబ్ పంత్ సరిగ్గా సరిపోతాడు. ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.07 స్ట్రైక్ రేట్‌లో 512 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఈ మెగా టోర్నీలో దాదాపు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నే ఫస్ట్ చాయిస్.
ఇక, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు అదనపు బలం. బ్యాట్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో సత్తా చాటగలడు. తన కెరీర్ లో 49 మ్యాచ్‌లు ఆడాడు. 19.36 సగటుతో 484 పరుగులు సాధించాడు. 145.34 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. అలాగే 8.17 ఎకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. జట్టులో మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ మెగా టోర్నీలో కీలకం కానున్నాడు. ఇప్పటి వరకు 50 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 15.50 సగటుతో 217 పరుగులు చేశాడు. మరోవైపు, బౌలింగ్ విషయానికి వస్తే జడేజా పొట్టి ఫార్మెట్‌లో 39 వికెట్లు తీసుకున్నాడు.
ఇక, టీమిండియా పేస్ బౌలింగ్ భువీ ఎంతో కీలకం. ముఖ్యంగా టీ-20 ఫార్మాట్ లో భువనేశ్వర్ కుమార్ ఎంతో తెలివిగా బౌలింగ్ వేస్తుంటాడు. భువనేశ్వర్ కుమార్ 51 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. అతను ఈ 51 మ్యాచ్‌లలో 6.90 ఎకానమీ రేటుతో 50 వికెట్లు తీశాడు. భువీ సగటు 32.18గా ఉంది. భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి పొట్టి క్రికెట్ లో అంతర్జాతీయ అనుభవం చాలా తక్కువగా ఉంది. కానీ, జట్టు ఇప్పటికీ అతనిపై విశ్వాసం ఉంచింది. షమీ 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్ లో అతను 73 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 8.81 ఎకానమీ రేటుతో 68 వికెట్లు తీసుకున్నాడు.
ఇక, టీ-20 లో గెలుపు గుర్రాల్లో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. టీమిండియా నెగ్గాలంటే అతడు రాణించడం చాలా కీలకం. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 6.66 ఎకానమీ రేటుతో 59 వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్ లో యార్కర్లతో ప్రత్యర్ధుల ఆటకట్టించడంలో బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇక, కుల్దీప్, చాహల్ లాంటి సీనియర్ లెగ్ స్పిన్ బౌలర్లు పక్కనపెట్టి యంగ్ గన్ రాహుల్ చాహర్ పై నమ్మకముంచారు టీమిండియా సెలక్టర్లు. రాహుల్ చాహర్ అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఇందులో, అతను 7.60 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు. దేశీయ స్థాయిలో 66 టీ 20 మ్యాచ్‌ల్లో 7.32 ఎకానమీ రేటుతో 82 వికెట్లు సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో 38 మ్యాచ్‌లు ఆడి, 7.41 ఎకానమీ రేటుతో 41 వికెట్లు పడగొట్టాడు.
మరో సీనియర్ బౌలర్ అశ్విన్ పై నమ్మకముంచారు టీమిండియా సెలక్టర్లు. అశ్విన్ అనుభవం జట్టుకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో 46 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 6.97 ఎకానమీ రేటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో, అతను బ్యాట్‌తో పాటు బౌలింగ్‌తో చాలాసార్లు అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే.జట్టులో మూడో ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ కు టీ20 జట్టులో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. అతను 12 అంతర్జాతీయ మ్యాచ్ లలో 6.88 ఎకానమీ రేటుతో 9 వికెట్లు పడగొట్టాడు. 156 దేశీయ టీ 20 మ్యాచ్ ల్లో 6.85 ఎకానమీ రేటుతో 133 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించగలడు.ఈ ఏడాది టీ 20 లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ పై కూడా బీసీసీఐ విశ్వాసం ఉంచింది. ఇషాన్ అంతర్జాతీయ స్థాయిలో 3 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 37.53 సగటుతో 80 పరుగులు చేశాడు. కానీ, ఈ ఆటగాడు క్షణాల్లో ఆటను మార్చగలడు ఇషాన్.