Begin typing your search above and press return to search.
45 నిమిషాలపాటు ఆ బ్యాంకు సేవలు బంద్..
By: Tupaki Desk | 7 Nov 2021 10:30 AM GMTసాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి బ్యాంకు సేవలు నిలిచిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఓ టాప్ బ్యాంకు సేవలు 45 నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. దేశ, విదేశాల్లో విస్తరించిన సిటీ బ్యాంక్ సేవలు సోమవారం ముప్పావు గంటపాటు పనిచేయవు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారుతు తమ ఖాతాదారులకు ఇప్పటికే తెలియజేశారు. కొందరికి ఫోన్ మెసేజ్లు, మరికొందరికి ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని చెప్పింది. సిటీ బ్యాంకుతో సంబంధం ఉన్న మొబైల్ యాప్ లు, ఇంటర్నెట్ సేవలు, 24 సిటీ ఫోన్ సేవలు తదితర సేవలన్నీ నిలిచిపోనున్నాయి. అయితే ఈ 45 నిమిసాలు తెల్లవారు జామున 3 గంటల నుంచి 3.34 నిమిషాల వరకు పనిచేయవన్నమాట. అయితే ఉదయం అయినందువల్ల ఆన్ లైన్ సేవలు వినియోగించేవారు సైతం పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చనే తెలుస్తోంది.
సిటీ బ్యాంకు నగదు వ్యవహారాలే కాకుండా ఇతర వ్యవహారాలను కూడా నిర్వహిస్తోంది. కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఇతర దేశాలకు విస్తరించనుంది. ఇప్పటికే ఆసియాలోని 13 దేశాల్లో సిటీ బ్యాంకు సేవలను విస్తరించింది. ఇయ త్వరలో యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియనల్లో సైతం కొత్త కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి దాకా ఆప్రికాలో సిటీ బ్యాంకు అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు వర్దమాన దేశాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.
ఇవే కాకుండా దేశంలో కొత్తగా లీజ్ రెంటల్ స్కాంటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. దీని కోంస కొన్ని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. వాటితో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్న తరువాత తమ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటోంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో రిటైల్ బిజినెస్ చేయడంలో డిస్కౌంటింగ్ సిస్టమ్ ను పరిచయం చేయనుంది.
అంతకుముందు ఈ రిటైల్ బిజినెస్ ను విక్రయించేందుకు సరైన కొనుగోలుదారులను ఎంపిక చేసుకుంది. వినియోగం నుంచి బయటకు వచ్చిన సిటీ బ్యాంకు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారం వైపు వెళ్తోంది. అయితే రిటైల్ వ్యాపారం కోసం అనుమతులకు దరఖాస్తుల చేశామని వాటి అనుమతులు రాగానే బ్యాంకు రిటైల్ వ్యాపారం ప్రారంభిస్తుందని సిటీ బ్యాంకు ఇండియా సీవో తెలిపారు. ఈ బ్యాంకుకు ఇండియాలో 55 శాఖలు ఉన్నాయి. ఇందులో మొత్తం 19 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 29 లక్షల మంది రిటైల్ ఖాతాదారులు ఉండగా.. 12 లక్షల బ్యాంకు అకౌంట్లు, 22 లక్షల క్రెడిట్ కార్డులున్నాయి.