Begin typing your search above and press return to search.
మన ఈ కష్టాలన్నింటికీ కారణం వాళ్ల రికార్డు పిచ్చి
By: Tupaki Desk | 28 May 2020 12:30 AM GMTరోడ్డు పక్కన జీవించే అనాథ ఆకలితో అల్లాడుతున్నాడు. వలస కార్మికుడు పిల్లా పాపలతో ఎండలో వందల కిలోమీటర్లు నడుస్తున్నాడు. చిరుద్యోగి ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నాడు. వ్యాపారి ఆదాయం లేకపోగా అద్దెలు, వడ్డీలు కడుతూ కుంగిపోతున్నాడు. ఇవి కాక ప్రాణం మీదికి తెచ్చుకున్న, ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఎందరో. కరోనా పుణ్యమా అని జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీని వల్ల ప్రభావితం కాని, నష్టపోని మనిషే భారత దేశంలో లేడంటే అతిశయోక్తి కాదేమో. ఇండియాలాగే ఎన్నో దేశాలు కరోనా బారిన పడి కుదేలవుతున్నాయి. ప్రపంచ చరిత్రలోనే ఇది అది పెద్ద విషాదం కాబోతోందన్నది స్పష్టం. ప్రపంచ యుద్ధాల్ని మించిన వినాశనానికి కరోనా దారి తీస్తోంది. ఈ కష్టానికి, నష్టానికి బాధ్యత వహించాల్సింది చైనానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇతర దేశాలపై బయో వార్ చేయడం కోసం వైరస్‌ను సృష్టించారా.. లేక దానంతటదే పుట్టిందా అన్నది పక్కన పెడితే కరోనాకు కేంద్రం మాత్రం చైనానే. ఆ వైరస్ బయటపడి జనాలు రోగగ్రస్థులవుతున్నా.. ప్రమాదకర రీతిలో వైరస్ వ్యాప్తి చెందుతున్నా చైనా అప్రమత్తం కాలేదు. ఎవరినీ హెచ్చరించనూ లేదు. కరోనా పుట్టిన వుహాన్‌లో ఒక రికార్డు కోసం జరిగిన ప్రయత్నమే ఇప్పుడు ప్రపంచమంతా కరోనా విస్తరించి వందల కోట్ల మంది అల్లాడుతుండటానికి కారణం అని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. ఈ ఏడాది ఆరంభంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వుహాన్‌లో ‘ది బైబుటింగ్’ అనే కమ్యూనిటీలో ఒక సామూహిక విందు కార్యక్రమం నిర్వహించారు. అందులో 13,986 వంటకాల్ని వడ్డించారు. ప్రపంచంలోనే అతి పెద్ద విందు కార్యక్రమంగా రికార్డు నెలకొల్పడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. అప్పటికే వుహాన్‌లో కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటికీ.. అధికారులు ఈ వేడుకను రద్దు చేయలేదు. ఇందులో 13 వేల మంది పాల్గొన్నారు. ఈ విందులో వుహాన్‌లోని 55 ప్రాంతాల వాళ్లు పాల్గొన్నారు. ఈ వేడుక తర్వాత అందులో 33 చోట్ల వైరస్ ప్రబలింది. అందుకు కారణం ఆ విందే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా వుహాన్ నగరమంతా వైరస్ వ్యాప్తి జరిగింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించిన వారి వల్ల ఆయా దేశాల్లో వైరస్ ప్రబలింది. ఇప్పుడు 200కు పైగా దేశాలు కరోనాతో అల్లాడుతున్నాయి. వందల కోట్ల మంది కుదేలవుతున్నారు.