Begin typing your search above and press return to search.
నోముల నర్సింహయ్య ఫేక్ ఆడియో వైరల్
By: Tupaki Desk | 3 Dec 2020 11:50 AM GMTరెండు రోజుల కిందటే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. ఆయన చివరగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న సంగతి తెలిసిందే. కానీ నర్సింహయ్య ఎన్నో ఏళ్ల పాటు ఉన్నది, ఆయనకు గుర్తింపు తెచ్చింది సీపీఎం పార్టీనే. కమ్యూనిస్టు నేతగానే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. నర్సింహయ్య ఇప్పటికీ సీపీఎంలోనే ఉన్నాడు అనుకునేవాళ్లు కూడా లేకపోలేదు. తమ పార్టీని వీడినప్పటికీ నర్సింహయ్యపై కామ్రేడ్స్‌లో ఇప్పటికీ అభిమానం పోలేదు. ఆ అభిమానమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
నోముల నర్సింహయ్య చనిపోతూ తనలో గూడుకట్టుకుని ఉన్న వామపక్ష భావజాలాన్ని బయటపెట్టారని.. తనను ఒక కమ్యూనిస్టు నేతగానే సాగనంపాలని కోరుకుంటూ ఆడియో సందేశం వినిపించారని ఒక ప్రచారం నడిచింది. నర్సింహయ్య వాయిస్‌తో ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో నర్సింహయ్య.. ‘‘మీ ఎర్ర జెండా బిడ్డగా కోరుకునేది ఒక్కటే. మీ అందరినీ ఎడబాసి ఏడేడు లోకాలకు అందకుండా పోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను ఎఫ్పుడూ కలగనలేదు. ఆ భగవంతుడు పిలిచినాడు. నేను వెళతా ఉన్నా. మీరందరూ మీ నర్సింహయ్యగా నా అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మీరు కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు’’ అని పేర్కొన్నట్లుగా ఉంది.
ఈ ఆడియో విని అధికార పార్టీలో నర్సింహయ్య సంతోషంగా లేరని, ఆయన మనసంతా కమ్యూనిస్టు పార్టీ మీదే ఉందని అనుకుంటున్నారంతా. కానీ ఇది ఫేక్ ఆడియో అని, The audio was created by an artist from the Communist Party imitating Narsimhaiah's voiceతర్వాత వెల్లడైంది. నర్సింహయ్య మనతో ఉంటే ఎలా ఉండేదని గుర్తు చేసుకుంటూ తన తోటి కళాకారులు కోరడంతోనే తాను ఆయన గొంతుతో మిమిక్రీ చేశానని.. దీని వల్ల బాధ పడి ఉంటే నర్సింహయ్య కుటుంబీకులు తనను క్షమించాలని కొండల్ అనే కళాకారుడు కోరడంతో వివాదానికి తెరపడింది.