Begin typing your search above and press return to search.
ఇద్దరి ప్రాణాలు తీసిన ఏపీ ఎమ్మెల్సీ కోడలి కారు
By: Tupaki Desk | 16 Aug 2020 10:50 AM GMTఏపీ ఎమ్మెల్సీ కారు హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ లో ఇద్దరి ప్రాణాలు తీసింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటన మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ కోడలి పేరు మీద ఈ కారు రిజిస్ట్రర్ అయినట్టు గుర్తించారు. అర్ధరాత్రి వేళ భారీ వర్షానికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92 సమీప కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. సిబ్బంది వచ్చి విద్యుత్ మరమ్మతులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి జూబ్లీ హిల్స్ వైపుకు దూసుకెళుతున్న కారు ఒక్కసారి విద్యుత్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఊహించని ఈ ప్రమాదంలో సాయానికి వచ్చిన స్థానిక వాచ్ మెన్ తోపాటు విద్యుత్ సంస్థ ఉద్యోగి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి కారు ఏపీలోని కర్నూలు ఎమ్మెల్సీ కుటుంబానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణరెడ్డి కోడలు లక్ష్మీకుమారి పేరు మీద ఈ కారు ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
కారు డ్రైవర్, అతడి సోదరుడు మద్యం తాగి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్సీతోపాటు వచ్చిన వీరు ఆ ఇంటికి వెళుతూ ఈ ప్రమాదం చేసినట్లు దర్యాప్తులో తేలింది. వారిపై కేసు నమోదు చేశారు.