Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ ‘ఫైర్’ చేసిన వారికి కీలక పదవులు ఇచ్చిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   28 Jan 2021 4:41 AM GMT
నిమ్మగడ్డ ‘ఫైర్’ చేసిన వారికి కీలక పదవులు ఇచ్చిన జగన్ సర్కార్
X
ఏపీ ఎన్నికల సంఘం వర్సెస్.. ఏపీ సర్కారు అన్నట్లుగా మారిన పరిస్థితుల్లో ఈ రెండు వ్యవస్థల మధ్య విబేధాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్పించి తగ్గని పరిస్థితి. రూల్ బుక్ కు భిన్నంగా ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన వారిపై చర్యల కొరడాను ఝుళిపిస్తున్నారు ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ. అదే సమయంలో.. అలాంటి వారికి కీలక పదవుల్ని ఇస్తూ నిర్ణయాల్ని తీసుకుంటుందిన ఏపీ సర్కార్.

పంచాయితీ ఎన్నికల నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన అధికారులకు ఏపీ సర్కారు కీలక పదవుల్ని అప్పజెబుతూ నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలకు ఓకే చెబుతూ ఇద్దరు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా వారికి కొత్త పోస్టింగ్ లు ఇచ్చింది.

మొత్తం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం అందులో నారాయణ్ భరత్ గుప్తాను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న నవీన్ కుమార్ ను బదిలీ చేసింది. ఆయన్ను గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్‌గా నిమించింది.

గుంటూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన శామ్యుల్ ఆనందకుమార్ పై బదిలీ వేటు వేసిన నిమ్మగడ్డ నిర్ణయాన్ని ఓకే చేస్తూ.. ఇప్పటివరకు ఆయన నిర్వహించిన బాధ్యతకు మించిన పోస్టులను కట్టబెట్టింది ప్రభుత్వం. ఆయన్ను రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కొర్పారేషన్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. శామ్యూల్ ను పంచాయితీ శాఖతోనే అనుసంధానం చేయటం గమనార్హం. నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన మరో ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకరికి మించి మరొకరు అన్న రీతిలో సాగుతున్న పరిణామాలు పంచాయితీ ఎన్నికలు పూర్తి అయ్యే నాటికి మరెన్ని ఘటనలు జరుగుతాయో?