Begin typing your search above and press return to search.

గంజాయి వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   28 Oct 2021 4:00 PM IST
గంజాయి వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
X
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై డ్రగ్స్, గంజాయి వ్యవహారంలో తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ, జనసేనకు చెక్ పెట్టేలా కేబినెట్ తీర్మానం చేసింది. గంజాయిపైన ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ ఆదేశించారు. చంద్రబాబు, పవన్ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశించారు.ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించాలన్నారు. కొందరు మౌనంగా ఉండడంపై జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.

టీడీపీ హయాంలోనే గంజాయి రవాణా జరిగిందని.. అప్పుడు వారు ఎక్కువగా పట్టించుకోలేదని సీఎం జగన్ కేబినెట్ భేటిలో ఆరోపించినట్టు తెలిసింది. వెంటనే టీడీపీ హయాంలో పట్టుకున్న లెక్కలు.. ఈ రెండున్నరేళ్లలో పట్టుబడిన లెక్కలను అధికారుల ద్వారా వివరించినట్టు తెలుస్తోంది.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సాగు అయినా దాడులు చేస్తామని.. దీనికోసం ప్రత్యేకంగా ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిద్దామని మంత్రులకు జగన్ స్పష్టం చేశారు. సంబంధిత నియోజకవర్గాల నేతలు, జిల్లా ఇన్ చార్జి మంత్రులను బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో గుట్కా నిషేధానికి కేబినెట్ తీర్మానించింది. ఏపీ సినిమా ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మేందుకు తీర్మానం చేశారు. అమ్మఒడి పథకం అర్హతకు విద్యార్థుల హాజరు శాతాన్ని 75శాతంకు తప్పనిసరి చేసింది.