Begin typing your search above and press return to search.
ఆఫ్ఘాన్ ను వీడిన అగ్రరాజ్యం ... ఒకరోజు ముందే మిషన్ సక్సెస్ !
By: Tupaki Desk | 31 Aug 2021 9:31 AM GMTముందు నుండి అందరూ ఊహించిందే చివరికి జరిగింది. గత, 20 ఏళ్ల పాటు తమ సహకారాన్ని అందించిన అమెరికా ఆఫ్గాన్ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం ఆఫ్గాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళింది. అమెరికా దళాలు అఫ్గానిస్థాన్ ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఇన్నాళ్లు స్వేచ్ఛగా ఆఫ్గన్ ప్రజలు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించే తాలిబన్లతో తమకు ఎలాంటి హాని జరుగుతుందోనని భయపడుతున్నారు. కొన్ని నెలలుగా అఫ్ఘన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా తరలిస్తున్న అమెరికా సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు కీలక ప్రకటన చేసింది.
ఇక ఆఫ్ఘన్ కు చెందిన కొందరు ప్రజలు, ప్రాణాలతో బ్రతికుంటే చాలని ఇంకేం వద్దంటూ సొంత ఊరును, వస్తువులను వదిలి ఖాళీ చేతులతో విమానాల్లో పారిపోతున్నారు. రెండు వారాల పాటు ఆఫ్ఘన్ నుంచి తమ సేనలను, కొంతమంది ఆఫ్ఘన్ పౌరులను తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం ఎయిర్ లిఫ్ట్ చేపట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 26న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది అమెరికా దళాలకు చెందిన సైన్యం, దాదాపు 169 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారు. ఆగస్టు 15న తాలిబాన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలిగిన తరువాత ఆ దేశం మళ్లీ తాలిబన్ల వశమవుతుందని అమెరికా ముందుగానే అంచనా వేసింది. అయితే, ఇంత తొందరగా తాలిబన్లు ఆఫ్ఘన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని ఊహించలేదంటూ అమెరికా జోబైడెన్ ప్రకటించారు.
దీంతో అఫ్గాన్ లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది అని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ పెంటగాన్ లో ప్రకటించారు. దీనితో అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు అఫ్గాన్ ను ఖాళీ చేశాయి. అయితే గత వారం రోజుల నుంచి కాబుల్‌లో చోటు చేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది. ఎయిర్ లిఫ్ట్ ప్రక్రియ చేపట్టిన తర్వాత, కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అమెరికా ఊహించిన విధంగానే పేలుళ్లు జరిగాయి. ఆ దాడి జరిగిన స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగాల్సిన తన అభిప్రాయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. 20 సంవత్సరాల యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
ఇక తరలింపు ప్రక్రియ పూర్తి అయిన సందర్భంలో జో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.. గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతి పెద్దది. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా, అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించాము. 20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్ లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నాను.
అయితే ఈ తరలింపు ప్రక్రియ ఇప్పటితో పూర్తైనట్లు కాదు, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అంటూ చెప్పారు.ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్ చెప్పారు. 20 ఏళ్ల క్రితం 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడికి ప్రతీకారంగా, ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా, దాని అధినేత బిన్ లాడెన్ ను హతమార్చడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగుపెట్టింది అమెరికా. ఇందుకోసం ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆల్ ఖైదాకు ఆశ్రయం కల్పించిన తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు విముక్తి కల్పించింది. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కాకుండా అడ్డుకుంది.