Begin typing your search above and press return to search.
సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు మే 9న విచారణ
By: Tupaki Desk | 4 May 2023 8:33 PM GMTఏపీ రాజధాని అమరావతి కేసు సుప్రీం కోర్టులో ఈ నెల 9 న విచారణ జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ కేసు విచారణను ముందుకు జరిపినట్లుగా తెలుస్తోంది. మామూలుగా అయితే ఈ కేసు జూలై 11న విచారణకు వాయిదా వేస్తూ గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు ఈ ఏడాది జనవరి 30న జరిగింది. ఆ తరువాత ఫిబ్రవరికి వాయిదా పడింది. అక్కడ నుంచి ఏకంగా జూలై 11కి వాయిదా వేశారు. అయితే ఆ సమయంలో ముందుగా ఈ కేసు విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు.
బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని కాబోలు ఏకంగా రెండు నెలల ముందుకే ఈ కేసుని జరిపారు అని అంటున్నారు. మే 9 న అమరావతి రాజధాని కేసు ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య దర్మాసనం విచారించనుంది. అయితే ఈ కేసు విచారణ త్వరితగతిన సాగితే మరి కొద్ది నెలలలోనే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని అన్న మాట అనకపోయినా విశాఖ నే ఫోకస్ చేస్తోంది. జగన్ సైతం సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం అంటూ నిన్నటికి నిన్న ప్రకటించారు. అంటే జగన్ విశాఖ వెళ్లేనాటికే ఈ కేసు తీర్పు వచ్చేస్తుంది.
ఒక వేళ తీర్పు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే ఏమి చేస్తారు అన్నది కూడా చర్చించాల్సిన విషయం. అయితే ఏమైనా అమరావతి రాజధాని విషయం మరి కొద్ది నెలల్లో తేలిపోయే అవకాశం అయితే కచ్చితంగా ఉంది.
ఈ తీర్పు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్తారు. కొత్త బిల్లు అసెంబ్లీలో పెట్టి చట్టం తీసుకుని వస్తారు. ఎటూ శాసనమండలిలో కూడా ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నందువల్ల మూడు రాజధానుల బిల్లు సులువుగా నెగ్గుతుంది.
ఒక వేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బగానే చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం పరంగా అయితే ప్రభుత్వం దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అది ఎలా ఉన్నా అమరావతి రాజధాని అన్నది కనుక సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే ఎన్నికల వేళ తెలుగుదేశానికి అతి పెద్ద బూస్టింగ్ ఇచ్చినట్లుగా అవుతుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే మూడు రాజధానుల ఇష్యూ కచ్చితంగా 2024 ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అభివృద్ధి అజెండాను తలకెత్తుకోనున్న విపక్షాలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చే తీర్పుని వజ్రాయుధంగా వాడుకుంటుంది అనడంలో డౌట్ లేదు.
అయితే వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయటే హై కోర్టులో అమరావతి రాజధాని అన్న దాని మీద సుప్రీం కోర్టులో అప్పీల్ చేయలేదు. చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయా లేవా అన్న దాని మీదనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ల చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందని, ఇందులో న్యాయ వ్యవస్థకు జోక్యం చేసుకునే వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే తమకు ప్లస్ అవుతుంది అని భావిస్తోంది.
అయితే చట్టం చేసే అధికారం ఉన్నా అన్ని చట్టాలు చేయవచ్చా, ప్రత్యేకించి విభజన చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాత అమరావతి అని 2015లో నాటి ప్రభుత్వం కూడా నోటిఫై చేసి కేంద్రానికి పంపించి ఆమోదించిన తరువాత దాని మీద సవరణ చేసి మరోసారి చట్టం చేసే అధికారం ఏపీ అసెంబ్లీకి మళ్లీ ఉంటుందా అన్నదే ఇక్కడ కీలకమైన విషయం.
దీంతో పాటే అనేక ఇతర అంశాలు రాజధాని రైతుల తరఫున వాదనలు ఇవన్నీ ముడి పడి ఉంటాయి కాబట్టి అన్నిటి మీద పరిపూర్ణమైన తీర్పును సుప్రీం కోర్టు ఇస్తుందని అంటున్నారు. మొత్తానికి మరి కొద్ది నెలలలో అమరావతి రాజధాని మీద తీర్పు రావచ్చు అన్నది వాస్తవం.