Begin typing your search above and press return to search.
బైక్ వేగం 1240 కి.మీ.. చలాన్ విధించిన ఏఐ కెమెరా!
By: Tupaki Desk | 13 Jun 2023 9:00 PM GMTప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హాట్ టాపిక్ గా మారుతుంది. నిత్యం దీనికి సంబంధించిన విషయాలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంటాయి. అయితే దేశం లోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కెమెరా లతో చలాన్లు వేసే పనికి పూనుకుంది కేరళ రాష్ట్రం. అయితే తాజాగా ఈ విషయం లో ఒక షాకింగ్ సంఘటన తెర పైకి వచ్చింది.
కొన్ని నెలల క్రితం కేరళ ప్రభుత్వం "సేఫ్ కేరళ" ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే 726 కెమెరాల ను రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసింది. రోడ్ల పైన వాహనదారులు ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనల కు పాల్పడినా ఈ కెమెరాలు గుర్తించి.. ఆటోమేటిక్ గా చలాన్ లు పంపిస్తాయి. ఈ కెమెరాల పనితీరును తొలుత ట్రయల్ నిర్వహించి, అనంతరం అమల్లోకి తీసుకువచ్చారు.
దీంతో ఈ ఏఐ కెమెరాలు అమల్లోకి వచ్చిన తొలి రోజు సుమారు 38,000 చలాన్ లను జారీచేశాయి. ఈ క్రమంలో ఈ చలాన్ లకు సంబంధించిన ఓ ఘటన వైరల్ గా మారింది. ఏఐ కెమెరా ఓ బైక్ వేగాన్ని గంటకు 1240 కి.మీ. గా నమోదు చేసింది. అనంతరం ఆ కెమెరా బైక్ ఫోటో ను కంట్రోల్ రూంకు పంపింది. అక్కడ సిస్టమ్ ఓవర్ స్పీడ్ ను గుర్తిస్తూ చలాన్ జారీ చేసింది.
ఇలా బైక్ వేగాన్ని గంటకు 1240 కి.మీ. తో నమోదు చేసిన వీడియోల ను జైహింద్ టీవీ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. అయితే ఇది హెల్మెట్ ధరించకపోవడం వల్ల వేసిన జరిమానా అని మొదట్లో అధికారులు పేర్కొన్నారు.. కానీ, అనంతరం బైకర్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని తెలుసుకుని ఎటువంటి జరిమానా విధించలేదట!
అయితే తొలుత ఈ ఏఐ కెమెరాల వ్యవస్థ ఆటోమేటిక్ గా పనిచేస్తుందని.. మానవ సాయం అవసరం లేదని అధికారులు నమ్మకంగా చెప్పారు. అయితే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తప్పులు జరుగుతున్నందున కంట్రోల్ రూంలో ఏఐ కెమెరాలు తీసిన ఫోటోలను పరిశీలించేందుకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు లను నియమించారు. వారు చలాన్ లు సక్రమంగా జారీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.