Begin typing your search above and press return to search.

'భవిష్యత్ ప్రధాని సోనూ'.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన న‌టుడు!

By:  Tupaki Desk   |   12 May 2021 2:30 PM GMT
భవిష్యత్ ప్రధాని సోనూ.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన న‌టుడు!
X
క‌రోనా మొద‌టి ద‌శ నుంచీ.. త‌న సేవాకార్య‌క్ర‌మాల‌తో ఈ దేశ‌పు నిజ‌మైన హీరోగా వెలుగొందుతున్నాడు సోనూ సూద్‌. అధికారం చేతిలో ఉన్న‌వాళ్లు క‌రోనా బాధితుల గురించి ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వినిపిస్తున్న చోట‌.. సోనూ సూద్ స‌హాయం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అత‌డే ఒక సైన్యంలా అందిస్తున్న స‌హ‌కారానికి అంద‌రూ ముగ్ధుల‌వుతున్నారు.

నిజానికి ఈ దేశంలో ల‌క్ష‌లాధికారులకు అంతేలేదు. కోటీశ్వ‌రులు కూడా కోకొల్ల‌లు. మ‌ల్టీ మిలియనీర్లు, బిలియ‌నీర్లు అంత‌కంత‌కూ పైకి ఎగ‌బాకుతున్నారు. కానీ.. ప‌క్క‌వాడికి స‌హాయం చేసేందుకు క‌నీసం ఎంగిలి చేతిని కూడా విస‌ర‌లేక‌పోతున్నారు. త‌మ త‌రాల‌కోసం కూడ‌బెడుతున్న జ‌నాలు.. ఈ క‌ష్ట స‌మ‌యంలో కూడా రూపాయి దానం చేయ‌లేక‌పోతున్నారు.

కానీ.. సోనూ మ‌రీ పెద్ద కోటీశ్వ‌రుడేం కాదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న సంక‌ల్పం పెద్ద‌ది. అందుకే.. అంద‌రికీ స‌హాయం చేస్తూ పోతున్నాడు. ఈ నేప‌థ్యంతో బాలీవుడ్ న‌టి రాఖీసావంత్ సోనూ సూద్ ను ‘భవిష్యత్ ప్రధాని' అంటూ సంబోధించింది. దీనిపై రియల్ హీరో స్పందించారు.

'నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నా. నా సోద‌రులు రాజ‌కీయాల్లో ఉన్నారు. ఎన్నిక‌ల‌తో పోరాడటం ద్వారా నేను ఏం పొందుతాను? అది నా ప‌ని కాదు' పేర్కొన్నారు సోనూ. తద్వారా.. తాను సామాన్యుడిగానే చేతనైన సహాయం చేస్తానని ప్రకటించారు సోనూ.