Begin typing your search above and press return to search.

సవతి తల్లిపై అత్యాచారం చేసిన నటుడు.. చోరీ కూడా చేశాడట

By:  Tupaki Desk   |   23 Jan 2021 7:30 AM GMT
సవతి తల్లిపై అత్యాచారం చేసిన నటుడు.. చోరీ కూడా చేశాడట
X
ముంబయిలో దారుణం జరిగినట్లుగా ఒక ఫిర్యాదు పోలీసులకు అందింది. నలభై ఏళ్ల టీవీ నటుడు ఒకరు పలు సీరియల్స్ లో నటిస్తూ.. మంచి పేరును సంపాదించారు. అతడి తండ్రి సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తుంటారు. అలాంటి కుటుంబంలో తాజాగా జరిగినట్లుగా చెబుతున్న ఒక ఉదంతం పెను సంచనలంగా మారింది. సదరు దర్శకుడికి ముగ్గురు భార్యలు.అందులోని ఒక భార్య అంధేరీలోని లోఖండ్ వాలాలో నివసిస్తోంది.

సవతి తల్లిపై కన్నేసిన సదరు నటుడు.. ఆమెపై కన్నేసిన సదరు నటుడు ఒంటరిగా ఉన్న వేళ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఉన్న నగదు.. నగలు దొంగతనం చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే.. పోలీసులు సదరు నటుడి పేరును బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదు.

సదరు నటుడి మీద వస్తున్న ఆరోపణలు రుజువైతే అరెస్టు చేస్తామని.. నటుడి పేరు.. తదితర వివరాల్ని మాత్రం వెల్లడించలేదన్నారు. నిజంగానే అత్యాచారం జరిగిందా? లేదంటే ఆస్తి తగదాల్లో భాగంగా ఇలాంటి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.