Begin typing your search above and press return to search.

టిమ్స్ లో కారిడార్లపైనే శవాలు

By:  Tupaki Desk   |   25 April 2021 1:30 PM GMT
టిమ్స్ లో కారిడార్లపైనే శవాలు
X
కరోనా కల్లోలంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిల్లో బెడ్స్ ఖాళీగా లేక క్యూలు కనిపిస్తున్నాయంటున్నారు. కరోనాతో చికిత్స పొందుతూ రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్ లోని టిమ్స్ కరోనా రోగులతో కిక్కిరిసిపోయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. టిమ్స్ లోని 8 ఫ్లోర్లు కరోనా రోగులతో నిండిపోయిందని చెబుతున్నారు. టిమ్స్ లో మార్చురీ లేకపోవడంతో చనిపోయిన వారిని మూట గట్టి ఆసుపత్రి కారిడార్లలో పడేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరి డెడ్ బాడీలు ప్యాక్ చేసి స్ట్రెచర్ లపై పడేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక చనిపోయిన రోగుల మరణవార్తను వారి బంధువులకు లేట్ గా చెబుతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని అంటున్నారు.

టిమ్స్ లోని 14 అంతస్థుల్లో 8 ఫోర్లను మాత్రమే వాడుతున్నారు. ఆ 8 అంతస్థులు కరోనా రోగులతో నిండిపోయాయి. మార్చురీ లేక మృతదేహాలను ఎక్కడికక్కడే పడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక ఫ్లోర్ లో రెండు రోజులుగా డెడ్ బాడీ తరలించకపోవడంతో ఐసీయూ మొత్తం వాసనతో నిండిపోయినట్లు తెలిసింది. అయితే ఈ ఆరోపణలపై టిమ్స్ యాజమాన్యం కానీ.. తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు.