Begin typing your search above and press return to search.
72 ఏళ్ల తాత శరీరం పై 98 శాతం పచ్చబొట్లే ఎందుకు వేసుకున్నాడంటే ?
By: Tupaki Desk | 14 March 2021 2:30 AM GMTఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి .. ఒకరికి చదువు అంటే పిచ్చి, మరొకరికి ఆటలంటే పిచ్చి , ఇంకొకరికి సినిమాలంటే పిచ్చి. ఎవరి పిచ్చి వారిది. ఇదే పిచ్చి కొందరిని ఎన్నో శిఖరాలు ఎక్కడానికి ఉపయోగపడితే , మరికొందరిని దేనికి పనికిరాకుండా చేస్తుంది. ఏదేమైనా ఎవరికీ ఇష్టం వచ్చింది వారు చేయడంలో వారికీ ఉన్న ఆత్మ సంతృప్తి మరెందులోను ఉండదు. అందుకేనేమో ఓ 72 ఏళ్ల వృద్ధుడు ..ఏకంగా తన శరీరం పై 98 శాతం పచ్చ బొట్లు వేయించుకున్నాడు. ఈయనకి పచ్చ బొట్లు అంటే మహా పిచ్చి. అరికాళ్లు తప్ప శరీరంలోని ప్రతి భాగంలో పచ్చ బొట్లు పొడిపించుకున్నారు. శరీరంపై 98 శాతం పచ్చబొట్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు.
ఇంతకీ ఆ 72 ఏళ్ల పచ్చ బోట్ల వీరుడి పేరు..వోల్ఫ్ గ్యాంగ్ కిర్ష్. గత రెండు దశాబ్దాలుగా పచ్చబొట్లు పొడిపించుకుంటున్న కిర్ష్ శరీరంపై 86 పెద్దపెద్ద పచ్చబొట్లు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పచ్చబొట్లు పొడిపించుకున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1989లో బెర్లిన్ గోడ కూలిన తర్వాత తాను పచ్చబొట్లు పొడిపించుకోవడం మొదలు పెట్టాడు.
ఈయన రిటైర్డ్ పోస్టాఫీసు వర్కర్. అయన ఉత్తర జర్మనీలో పోస్టాఫీసులో పనిచేస్తున్నప్పుడు టాటూలు వేయించుకోలేకపోయానని, జర్మనీ తిరిగి ఏకమయ్యేంత వరకు వేచి చూడాల్సి వచ్చిందని అన్నాడు. తన గొంతు, వేళ్లు సహా శరీరం కింద 17 ఇంప్లాంట్లు కూడా ఉన్నట్టు తెలిపాడు. వీటిలో కొన్ని మేగ్నటిక్ ఇంప్లాట్లు అని వివరించాడు. శరీరంలోని ఏ భాగాన్ని వదిలిపెట్టకుండా ప్రతి చోటా కూడా పచ్చ బొట్లు వేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 720 గంటలు కూర్చోవాల్సి వచ్చిందని వివరించాడు. 46 ఏళ్ల వయసులో తొలి టాటూ వేయించుకున్నట్టు చెప్పాడు. వోల్ఫ్ తన కనుగుడ్లపైనా టాటూ పొడిపించుకోవడం విశేషం. తన టాటూ వ్యసనం కోసం అతడు ఏకంగా 25 వేల యూరోలు ఖర్చు చేశాడు. ఈయన విధుల్లో నడిచి వెళ్తుంటే ఎంతోమంది ఇతనితో ఫోటోలు తీసుకోవడానికి ఉత్సహపడతారు. ఈ విషయాన్ని మేగ్నెటో ఎంతో సంతోషంగా తెలిపాడు.