Begin typing your search above and press return to search.
64 ఏళ్ల జడ్జికి.. 50 ఏళ్ల మహిళా లాయర్ కు పెళ్లి.. ట్విస్టు ఏమంటే?
By: Tupaki Desk | 6 Sep 2022 11:41 AM GMTజిల్లా జడ్జి శివపాల్ సింగ్ అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. ఆర్జేడీ అధినేత.. బిహార్ కు పలుమార్లు ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా వ్యవహరించిన లాలూ ప్రసాద్ యాదవ్ కు అవినీతి ఆరోపణల కేసులో శిక్ష వేసిన న్యాయమూర్తి అన్నంతనే ఆయన గుర్తుకు వస్తారు. ఆయన తీర్పులతో వార్తల్లోకి వచ్చే ఆ జడ్జి తాజాగా మాత్రం ఆయన వ్యక్తిగత విషయంలో వార్తల్లోకి వచ్చారు.
64 ఏళ్ల వయసులో తనకంటే పద్నాలుగేళ్ల చిన్నదైన మహిళా లాయర్ ను పెళ్లి చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ లోని గొడ్డా జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన.. మరో ఆర్నెల్ల వ్యవధిలో రిటైర్ కానున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా నాయకురాలు.. గొడ్డా జిల్లా కోర్టు లాయర్ అయిన 50 ఏళ్ల నూతన్ తివారీని ఇటీవల పెళ్లాడారు.
ఇద్దరికి వారి జీవన సహచరులు మరణించి ఒంటరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మొదలైన ప్రేమ.. పెళ్లి పీటల వరకు వచ్చింది. వీరిద్దరి పెళ్లి స్థానిక న్యాయవాద వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. శివపాల్ సతీమణి 2006లో మరణించగా.. నూతన్ తివారీ భర్త కూడా ఆ మధ్యన మరణించారు. వీరికి ఒక కొడుకు.. కుమార్తె ఉన్నారు. జీవిత భాగస్వామ్యుల్ని కోల్పోయిన జడ్జి.. లాయర్లు ఒకటి కావటం ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.