Begin typing your search above and press return to search.
అమెరికా దివాలా.. ఆఖరి హస్తం ప్లాటినం కాయిన్?
By: Tupaki Desk | 28 May 2023 6:00 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకు ఆఖరి హస్తం ప్లాటినం కాయిన్ ను రంగంలోకి దించుతారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ దేశాన్ని దివాలా నుంచి రక్షించేందుకు రుణ పరిమితి విషయంలో డెమొక్రాట్, రిపబ్లికన్ లకు సమయం దగ్గరపడుతోంది. జూన్ వరకు ఒప్పందం జరిగితేనే అంతా సవ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. లేదంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని.. ఇది కాస్తా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. జూన్ 1 నాటికి డెమొక్రాట్లు, రిపబ్లికన్ లు ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా ప్రభుత్వం చెల్లింపులు చేయలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రిపబ్లికన్ లు, వైట్ హౌస్ ఇటీవల చర్చలు జరిపాయని.. అవి సానుకూలంగానే జరిగినట్లు సంకేతాలు వచ్చాయి. కానీ అవి ఏమాత్రం అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గించలేక పోయాయని నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా చిట్ట చివరి ప్రయత్నంగా ప్లాటినం కాయిన్ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. ట్రిలియన్ డాలర్ అనగా రూ.82 లక్షల ప్లాటినం కాయిన్. దీనిని ముద్రించడమే ఆఖరి హస్తమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1997 కరెన్సీ చట్టం ప్రకారం అత్యధిక విలువతో కూడిన ప్లాటినం కాయిన్ తయారు చేసే అధికారం అమెరికా ఆర్థిక మంత్రికి ఉంటుంది. నాణేలు సేకరణ చేసేవారు కొనుగోలు చేసే విధంగా భారీ కాయిన్ రూపొందించడం కోసమే ఈ ప్రత్యేక అధికారం. ట్రిలియన్ డాలర్ కాయిన్ ముద్రించిన అనంతరం దీనిని ఫెడరల్ రిజర్వ్ కు పంపించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది పెద్ద సైజులో కాకుండా పాకెట్ లో పట్టే విధంగా చిన్నగా ముద్రించి దీనిపై సున్నాలకు బదులు అక్షరాలతోనే ట్రిలియన్ అని రాసే సులువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
రిపబ్లికన్ లు, డెమొక్రాట్ ల మధ్య ఒప్పందం కుదరకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా ఉండేందుకు ఈ కాయిన్ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా ఉండేందుకు ప్లాటినం కాయిన్ ముద్రణ అనే అంశం గురించి 2010లో ఓ బ్లాగ్ లో పోస్టు రాశారు. అట్లాంటాకు చెందిన కార్లోస్ ముచా అనే లాయర్ ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. కరెన్సీ చట్టం ఆధారంగానే ఈ ప్రతిపాదన చేశారు. అందుకే ఆ లాయర్ ను ఇప్పుడు ప్లాటినం కాయిన్ ఇంటలెక్చువల్ క్రియేటర్ గా పిలుస్తున్నారు. కానీ ఈ కాయిన్ అంశంపై జో బైడెన్ ప్రభుత్వం ఆసక్తి కనబరచడం లేదు.
కాగా బ్లాగ్ లో పోస్టు చూసిన తర్వాత మింట్ మాజీ డైరెక్టర్ ఫిల్ డీల్ దానిపై స్పందించారని.. అందుకు తనకు ఓ ఈమెయిల్ పంపించారని కార్లోస్ ముచా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన భవిష్యత్ లో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారని తెలిపారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయని.. అప్పుడు కూడా ఈ ప్లాటినం కాయిన్ అంశం తెరమీదకు వచ్చిందని నిపుణులు అంటున్నారు. రుణ పరిమితి విషయంలో చర్చ జరిగిన ప్రతిసారి దీని ప్రస్తావన ఉంటుందని పేర్కొన్నారు.