Begin typing your search above and press return to search.
జీన్స్ తో పార్లమెంట్ కి .. ఆ మహిళ ఎంపీకి చేదు అనుభవం , ఏమైందంటే ?
By: Tupaki Desk | 3 Jun 2021 10:30 AM GMTసమాజంలో కొన్ని కట్టుబాట్లు , సంప్రదాయాలు అనేవి ఉన్నాయి. వాటిని అందరూ పాటించాల్సిందే. నలుగురితో పాటుగా సమాజంలో జీవిస్తున్నప్పుడు వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవించే హక్కు ఉంటుంది. ఇక సమాజంలో ఉన్న అధికారులు , ప్రజాప్రతినిధులు కానీ .. ముఖ్యంగా ఈ సమాజ కట్టుబాట్లుకి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే వీరిని పలువురు ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి. అయితే , కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు సైతం వాటిని అతిక్రమిస్తుంటారు. గుడికి ఎలా వెళ్లాలి , బడికి ఎలా వెళ్లాలి , ఇంట్లో ఎలా ఉండాలి అనేది ఎవరు చెప్పరు. ఆయా సందర్భాన్ని బట్టి అందరూ నడుచుకుంటారు.
ఇదిలా ఉంటే .. తాజాగా ఓ మహిళా ఎంపీ కి పార్లమెంట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె వేసుకున్న డ్రెస్ కారణంగా స్పీకర్ ఆమెని పార్లమెంట్ లోకి అనుమతించలేదు. అసలు వివరాల్లోకి వెళ్తే .. టాంజనీయాలో ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. మహిళా ఎంపీ ప్యాంట్ ధరించి పార్లమెంట్‌కు రావడంతో పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. కండెస్టర్ సిచ్వాలే అనే మహిళా ఎంపీ ప్యాంట్ ధరించి సభకు రావడంతో సభ్యులందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె సభకు క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. మహిళ ఎంపీ ప్యాంట్ ధరించి పార్లమెంట్ కు రావడం వల్ల సభను విడిచి వెళ్లాలని సూచించినట్లు స్పీకర్ తెలిపారు. సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా వింత వింత దుస్తులు ధరిస్తుండటం వల్ల సమాజానికి ఏం సమాధానం చెబుతారని సభ్యులు సభ్యులు ప్రశ్నించారు. అయితే ఆ దేశంలో మహిళలు జీన్స్ ధరించి సభకు రావడం అనేది నిషేధించారు. అయితే ఇలాంటి దుస్తులు ధరిచి పార్లమెంట్‌కు రావడం ఇదేమి మొదటి సారి కాదని, ఎన్ని సార్లు చెప్పినా ఈ సాంప్రదాయ దుస్తులతో కాకుండా జీన్స్ ధరిస్తూ సభలకు వస్తున్నారని కూడా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుంచి ఇలాంటి దుస్తులు ధరిస్తూ ఎవరైన మహిళలు వస్తే సభలోకి ప్రవేశం ఉండదని పార్లమెంట్ ఛాంబర్ ఉత్తర్వులు జారీ చేసింది.