మొన్ననే జైలు నుంచి.. కరోనా నుంచి కోలుకొని బయట కొచ్చిన శశికళ అప్పుడే రాజకీయం మొదలుపెట్టింది. అన్నాడీఎంకే పార్టీపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తోంది. బయటకు రాగానే రాజకీయం షురూ చేసేసింది.
తాజాగా అన్నాడీఎంకే పార్టీపై హక్కు కోసం మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ప్రయత్నాలు ప్రారంభించింది. జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు తనకే చెందుతుందని.. ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో తమిళనాడు రాజకీయం వేడెక్కింది.
అటు శశికళకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలియడం సంచలనమైంది. అన్నాడీఎంకే పార్టీకి ఆమె సారథ్యం వహించాలని.. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు అండగా ఉండాలని వాటి సారాంశం.కాగా ఈ పోస్టర్లు అంటించిన నేతలపై అన్నాడీఎంకే పార్టీ చీఫ్, సీఎం ఫళని స్వామి సీరియస్ అయ్యారు. పోస్టర్లు వేసిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.