Begin typing your search above and press return to search.

జగన్, కేసీఆర్ లకు ఆ సర్వే గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   13 July 2023 3:02 PM GMT
జగన్, కేసీఆర్ లకు ఆ సర్వే గుడ్ న్యూస్
X
తెలంగాణ లో ఎన్నికల నగారా పరోక్షంగా మోగిన సంగతి తెలిసింది. తెలంగాణ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల లో ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎన్నికలు పూర్తి చేసే దిశంగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 15 వ తేదీ నాటికి తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి...డిసెంబరు రెండో వారం లో పోలింగ్ చేపట్టే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యం లోనే అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష హోదా కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ బీజేపీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదంటూ పోటాపోటీ గా అన్ని పార్టీలు ప్రకటనలిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహప్రతివ్యూహాల తో బిజీబిజీ గా ఉన్నాయి.

ఈ నేపథ్యం లోనే ఇప్పటికిప్పుడు తెలంగాణ లో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అన్న విషయంపై చర్చ మొదలైంది. తాజాగా పోలింగ్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం తెలంగాణ లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఏపీ లో ఇంకోసారి జగన్ సీఎం పదవి ని చేపడతారని వెల్లడైంది. తెలంగాణ లో బీఆర్ఎస్ కు 45 శాతం, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు పోలవుతాయని, బీజేపీకి 16% ఓట్లు పడతాయని వెల్లడైంది. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వే చెబుతోంది.

ఏపీలో జగన్ పాలన, తెలంగాణ లో కేసీఆర్ పాలన బాగుందని మెజార్టీ ప్రజలు అనుకుంటున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. ఇక, జగన్ పాలన అద్భుతంగా ఉందని 17 శాతం మంది ఓటు వేయగా, 40 శాతం మంది కేసీఆర్ పాలన ను మెచ్చుకుంటున్నారట. కేసీఆర్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందని 15 శాతం మంది ,ఎటూ చెప్పలేమని మూడు శాతం మంది, కేసీఆర్ పాలన బాగోలేదని 20 శాతం మంది అఉన్నారట. ఏది ఏమైనా తాజా సర్వే ఫలితాలు జగన్, కేసీఆర్ లకు ఊరటనిచ్చేలా ఉన్నాయని టాక్ వస్తోంది.