Begin typing your search above and press return to search.

దుబ్బాక లో టిఆర్ఎస్ కొంపముంచిన చపాతి రోలర్‌ !

By:  Tupaki Desk   |   10 Nov 2020 4:55 PM GMT
దుబ్బాక లో టిఆర్ఎస్ కొంపముంచిన చపాతి రోలర్‌ !
X
తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం అందుకుంది. తోలి రౌండ్ నుండి నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ నడమ చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ ‌ఎస్‌ కంచుకోట లో కమలం వికసించింది. 20 - 21 - 22 - 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో విజయం సాధించింది. ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది. దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా... అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఒకానొక సమయంలో తెరాస లీడ్ లోకి వచ్చినప్పటికీ , ఆ తర్వాత వరుస రౌండ్ల లో బీజేపీ ఆధిక్యం చూపించడంతో టీఆర్‌ ఎస్‌ పరాజయం పాలైంది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే , దుబ్బాకలో తమ ఓటమికి చపాతి రోలర్‌ కారణమని టీఆర్ ‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు దుబ్బాకలో తెరాస ఓటమికి ,చపాతి రోలర్‌ కి కారణం ఏంటి అంటే .. దుబ్బాక బరిలో మొత్తం 23 మంది పోటీలో నిలిచారు. వారిలో ఓ స్వతంత్ర అభ్యర్థికి కారును పోలిన గుర్తు అయిన చపాతీ రోలర్ ని కేటాయించారు. ఈ గుర్తే టీఆర్‌ ఎస్‌ కొంప ముచ్చిందని సొంత పార్టీ నేతలు ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. అయితే..చపాతీ రోలర్‌ కూడా అచ్చం కారు లాగే ఉండటం విశేషం. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి. అలాగే, నోటా కు 552 ఓట్లు పోల్‌ అయ్యాయి. చపాతీ రోలర్‌ ఓట్లు టీఆర్‌ ఎస్‌ కు వచ్చేయని, దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్‌ కు వేసారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే , జరిగిపోయిన తర్వాత ఎన్ని అనుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు అని అందరికి తెలిసిందే. ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు. లక్ష మెజార్టీ వస్తుందని హరీష్‌ అంచనా వేసినప్పటికీ చివరికి ఓటమి చెందడం గమనార్హం.