Begin typing your search above and press return to search.
ఒక్కటైన నేతలు... ఆ సీటు పక్కా టీడీపీదే...!
By: Tupaki Desk | 10 July 2023 1:00 PM GMTఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా లో ఉన్న కీలకమైన నియోజకవర్గం కురుపాం. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. గెలుపు టీడీపీదేన ని అంటున్నారు. దీనికి కారణం.. నేతలు చేతులు కలపడమే. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నేత.. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వరుస విజయాలు దక్కించుకున్నారు.
2014, 2019 ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి గెలుపు గుర్రం ఎక్కారు. ఆ రెండు సార్లు కూడా.. టీడీపీ తరఫున జనార్థన్ థాట్రాజ్ పోటీ చేశారు. అయితే.. ఆయన పరాజయం పాలయ్యారు. తర్వాత.. పార్టీకి దూరంగా ఉన్నారు. పైగా ప్రజల్లోనూ ఆయన యాక్టివ్ గా ఉండడం లేదు. దీంతో రెండేళ్ల కిందటే.. కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా తొయ్యక జగదీశ్వరిని చంద్రబాబు నియమించారు.
ఈమెకు గిరిజన సామాజిక వర్గం లో మంచి బలం ఉండడంతోపాటు.. ప్రస్తుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి కూడా దూరపు చుట్టం అవుతారు. దీంతో ఆమె కు సానుభూతి మెండుగా ఏర్పడింది. పైగా.. ప్రభుత్వ అవి నీతి సహా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాల ను కూడా జగదీశ్వరి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నా రు. దీంతో ఆమెకు సానుకూల పవనాలు ఏర్పడుతున్నాయని టీడీపీ అంచనా వేసింది.
తాజాగా కురుపాం నియోజకవర్గం పై చంద్రబాబు నేతృత్వంలో అభ్యర్థిని ఖరారు చేసే సమీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్‌చార్జి తొయ్యక జగదీశ్వరి పేరు ను ఎక్కువమంది నేతలు సమర్థించారు. అంతేకాదు.. అక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు(ఈయన పుష్ప శ్రీవాణి కి మామగారు కూడా) కూడా ఆమెకే మద్దతు తెలిపారు. దీంతో పార్టీ బలోపేతం అయినట్టేనని.. విజయం రాసిపెట్టుకోవచ్చని టీడీపీ నాయకులు చెబుతున్నారు.