Begin typing your search above and press return to search.
ఫ్లోరైడ్ ను తెలంగాణ జయించింది : మంత్రి కేటీఆర్
By: Tupaki Desk | 18 Sep 2020 6:15 AM GMTతెలంగాణ వాసులు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఫ్లోరైడ్. తాజాగా ఆ సమస్య నుండి తెలంగాణ బయటపడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 967 ఉన్నాయి. అయితే , ప్రస్తుతం ఆ సంఖ్య సున్నాకు చేరిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిందంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని, టీమ్ మిషన్ భగీరథను కేటీఆర్ అభినందించారు.
2015 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ లో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 402 ఉండగా, ప్రస్తుతం ఏపీలోని 111 గ్రామాల్లో మాత్రమే ఈ సమస్య ఉంది. రాజస్థాన్‌లో ఐదేళ్ల క్రితం 7056 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండగా ప్రస్తుతం ఈ సమస్య 3095 గ్రామాలకు పరిమితమైంది. బిహార్‌లో 498 గ్రామాల్లో మాత్రమే ఫ్లోరైడ్ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు అది 861 గ్రామాలకు విస్తరించింది. జార్ఖండ్ లో ఫ్లోరైడ్ సమస్య ఉన్న గ్రామాల సంఖ్య 10 నుంచి 81కు పెరిగింది. ఐదేళ్ల క్రితం తమిళనాడులో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలేవీ లేవు. కానీ ప్రస్తుతం 236 గ్రామాల్లో సమస్యను గుర్తించారు.
దేశంలోకెల్లా ప్రమాదకర స్థాయిలో ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలో ఉండేది. 1945లో తొలిసారిగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను గుర్తించారు. అప్పటి నుంచి ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకుని ఈ ప్రాంతం విలవిల్లాడుతోంది. ఈ సమస్య కారణంగా చాలా మంది కాళ్లు వంకర్లు పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి అధిక మోతాదులో ఫ్లోరైడ్ శరీరంలోకి వెళ్లడం వల్ల ఫ్లోరోసిస్ సమస్య వస్తుంది. తాగునీరు, ఆహారం, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఇది శరీరంలోకి చేరుతుంది. ఫ్లోరైడ్ ఎక్కువ మోతాదులో ఉన్న నీటిని చాలా కాలంపాటు తాగడం వల్ల డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ సమస్యలు వస్తాయి. నీటిలో ఫ్లోరైడ్ శాతం లీటర్‌కు 1 పీపీఎం కంటే ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి హానికరం. 1.5 పీపీఎం కంటే ఎక్కువగా ఉంటే ఫ్లోరైడ్‌తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మునుగోడు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో 6-7 పీపీఎం వరకు ఫ్లోరైడ్ ఉండేది. కానీ , వారికి కృష్ణా జలాలను తాగునీరుగా అందించడం ద్వారా ఈ సమస్య పై విజయం సాధించారు.