Begin typing your search above and press return to search.
మా సాములోరికి మర్యాదలు చేయాలన్న ఆ ప్రైవేటు పీఠం
By: Tupaki Desk | 14 Nov 2020 7:30 AM GMTఅధ్యాత్మిక కేంద్రాలన్నంతనే.. తమ ప్రపంచంలో తాము ఉంటూ.. తమ వద్దకు వచ్చినోళ్లకు తమకు తోచిన సందేశాలు ఇవ్వటం మామూలే. అందుకు భిన్నంగా మా సాములోరి పుట్టినరోజు వస్తోంది.. ఆ సందర్భంగా రాష్ట్రంలోని ఫలానా ఆలయాలకు చెందిన పూజారులు.. ఆయా పీఠాలకు చెందిన వారు వచ్చి సాములోరికి మర్యాదలు చెల్లించుకొని.. ప్రసాదాలు స్వీకరించాలన్న వినయపూర్వక విన్నపాన్ని ఇప్పటివరకు చూసి ఉంటారా?
అదెలా అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. సామూలోరి మనసుకు తోచిన ఈ సరికొత్త సంప్రదాయాన్ని పాటించాలన్న విన్నపాన్ని ఏపీ సర్కారుకు లేఖ రూపంలో రాసేశారు శారదా పీఠాధిపది స్వరూపానంద స్వామి. ఈ నెల 18న ఆయన పుట్టినరోజు. అదే రోజున స్వామివారి దర్శనం చేసుకొని.. ఆయనకు మర్యాదలు చెల్లించుకోవాలని.. అది కూడా వచ్చే వారి స్థాయికి తగ్గట్లు అన్న కండీషన్ పెట్టిన వైనం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
శారదా పీఠం మేనేజర్ ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాయగా.. అందుకు తగ్గట్లే అధికారులు స్పందించటం మరింత షాకింగ్ గా మారింది. ‘మా స్వామికి మర్యాదలు చేయండి’ అని అడగటమేపెద్ద విషయమైతే.. మా సాములోరికి మర్యాదలు చేయాల్సిన వారి జాబితా ఇదిగో.. అంటూ లేఖ పంపిన తీరు హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ తరహా విన్నపంతో కూడిన ఆదేశాల్ని జారీ చేయలేదని.. అందుకు ప్రభుత్వాన్ని దన్నుగా చేసుకోలేదంటున్నారు. శారదా పీఠం స్వాములోరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.