Begin typing your search above and press return to search.
హైవే పై ఆ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ .. ఏం జరిగింది
By: Tupaki Desk | 9 Sep 2021 10:16 AM GMTదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనటువంటి అద్భుతం చోటు చేసుకుంది. విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు హైవేలు ఎంత వరకు ఉపయోగపడతాయి అనే విషయంపై ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. రాజస్థాన్ లోని జలోర్ హైవేపై సీ 130 సూపర్ హెర్క్యులస్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం నేషనల్‌హైవేపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫీల్డ్‌పై ల్యాండ్ అయింది. రక్షణశాఖకు చెందిన ఈ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి, ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ ఫీల్డ్ ప్రారంబోత్సవం సందర్భంగా ఈ విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైవేల పై అనేక చోట్ల హెలిప్యాడ్లను కూడా నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదో గొప్ప ఘనత అన్నారు. ఆర్మీ సామర్థ్యాన్ని పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను డెవలప్ చేస్తున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు.
ఎమర్జెన్సీ ఫీల్డ్స్‌ను ప్రకృతి విపత్తు సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కూడా వాడనున్నట్లు ఆయన వెల్లడించారు. జాలార్ లో ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ వద్ద మూడు హెలిప్యాడ్లను కూడా నిర్మించినట్లు మంత్రి చెప్పారు. అంతర్జాతీయ బోర్డర్ వద్ద ల్యాండింగ్ ఫీల్డ్ ఉండడం భారత్ సంసిద్ధతను చూపుతుందని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకునేందుకు ఇదో మార్గమన్నారు. భారత్ ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నట్లు మంత్రి తెలిపారు.
సాధారణంగా ఏదైనా కొత్త ఐడియా వస్తే, దానిపై అనుమానాలు వ్యక్తం అవుతాయని, కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ కు రక్షణశాఖ, వైమానిక దళం ఓకే చెప్పడం సంతోషకరమన్నారు. జాలోర్ లో మూడు కిలోమీటర్ల పొడువైన ల్యాండింగ్ ఫీల్డ్స్ ను నిర్మించినట్లు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో.. సీ-130, సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలను జాలోర్ హైవేపై దించారు.