Begin typing your search above and press return to search.

జనసేన ట్రాప్ లో ఆ పార్టీ ... ?

By:  Tupaki Desk   |   9 Oct 2021 8:34 AM GMT
జనసేన ట్రాప్ లో ఆ పార్టీ ... ?
X
ఏపీలో రాజకీయాలు అలా ఇలా లేవు. ఎత్తులు పై ఎత్తులు అందరూ వేస్తున్నారు. ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎవరు చెప్పుకున్నా కొత్త స్ట్రాటజీల ముందు చిత్తు కావాల్సిందే అంటున్నారు. మేమే తోపులం, మేమే చాణక్యుడిని చంపి పుట్టామని అనుకుంటే చివరికి ట్రాజడీ సీన్లే చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా కేవలం వారం వ్యవధిలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత ఇలాకా అన్న ఒక్క పాయిటే ఇక్కడ విపక్షాలను అట్రాక్ట్ చేస్తోంది. ఇక గెలుపు అన్నది బద్వేల్ లో ముందే డిసైడ్ అయిపోయింది. దీని మీద జనాల అటెన్షన్ ఎంతవరకూ ఉందో ఎవరికీ తెలియదు కానీ విపక్ష శిబిరం వేసే ఎత్తులు పై ఎత్తులు మాత్రం థ్రిల్లర్ సినిమానే తలపిస్తున్నాయి అని చెప్పాలి.

బద్వేల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇలా వచ్చిందో లేదో అలా జనసేనని పవన్ కళ్యాణ్ మేము పోటీ చేయడంలేదు అని చెప్పేశారు. అంతే కాదు ఈ ఎన్నిక కరోనాతో ఎమ్మెల్యే మరణించడం వల్ల వచ్చింది. ఆయన సతీమణికే టికెట్ ఇచ్చారు కాబట్టి సానుభూతితో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పేశారు. సరే ఇంతవరకూ బాగానే ఉన్నా జనసేన మాట తరువాత టీడీపీ కూడా అదే బాట పట్టింది. ఎంతో తర్జన భర్జన చేసిన్ నెల రోజుల ముందే అభ్యర్ధిని నిలిపిన టీడీపీ సడెన్ గా తాము కూడా సానుభూతి యాంగిల్ లోనే పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించేసింది.

ఇదే సంచలనం అనుకుంటే అకస్మాత్తుగా బరిలోకి బీజేపీ వచ్చింది. ఈ పార్టీ జనసేన మిత్ర పక్షం. బద్వేల్ లో పోటీ చేయమని చెప్పి ఈసారి ఆఫర్ జనసేనకు ఇచ్చిన పార్టీ. మరి జనసేన తప్పుకుంటే కూటమి కచ్చితంగా పోటీలో లేనట్లే. కానీ బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకం అన్న పాయింట్ పట్టుకుని పోటీకి సై అంది. ఇలా మిత్ర భేదానికి బద్వేల్ ఉప ఎన్నిక బీజం వెసిందని అంతా అనుకున్నారు. మరో వైపు పవన్ చెబితే టీడీపీ పాటించింది కాబట్టి ఆ రెండు పార్టీలతో కొత్త జట్టు ఏపీలో రాబోతోంది అని కూడా అంచనా వేశారు.

అయితే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారం చేస్తుంది అంటున్నారు. దీని మీద బీజేపీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాము ఎప్పటికీ మిత్రులమే అని కూడా చెబుతారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన కలసి పోటీ చేస్తాయని కూడా అంటున్నారు. మరి అదే జరిగి జనసేన బీజేపీకి మద్దతు గా ప్రచారం చేస్తే టోటల్ ఎపిసోడ్ లో నష్టపోయింది ఎవరు అంటే టీడీపీనే అని చెప్పాలేమో. ఇక్కడ టీడీపీ అసలు పోటీలో లేకుండా పక్కన ఉన్నట్లే కదా. మొత్తానికి ఇదో రకం రాజకీయ ఎత్తుగడ అనుకుంటే తప్పేంటి. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అలాగే ఎదుటివారిని బట్టి చూసి ఫాలో కావడానికి ఇది పరీక్షా పత్రం అంతకంటే కాదు, ఎవరి స్టాండ్ వారికి ఉండాలి. టీడీపీ ఇలాంటి విషయాల్లోనే గత మూడేళ్ళుగా తప్పుటడుగులు వేస్తోంది అంటే ఆలోచించుకోవాల్సిందే.