Begin typing your search above and press return to search.

ఆ ముస్లిం యూనివర్సిటీ దేశానికే ఆదర్శం : ప్రధాని మోడీ !

By:  Tupaki Desk   |   22 Dec 2020 9:02 AM GMT
ఆ ముస్లిం యూనివర్సిటీ దేశానికే ఆదర్శం : ప్రధాని మోడీ !
X
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ .. ఏఎంయూ మినీ ఇండియా అని , ఆ యూనివర్సిటీ దేశానికే ఆదర్శమని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఎంయూ స్థాపించి వందేళ్లు పూర్తి అయిన సమయంలో నిర్వహించిన శతాబ్ది మహోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా ఆయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ గౌరవ అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వాస్త‌వానికి యూనివ‌ర్సిటీ స్థాపించి సెప్టెంబ‌ర్ 14వ తేదీతో వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా లాక్ డౌన్ కార‌ణంగా శ‌తాబ్ది ఉత్స‌వాలు జ‌ర‌ప‌లేక‌పోయారు. వందేళ్ల సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఏఎంయూపై పోస్ట‌ల్ స్టాంప్‌ ను ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు.

ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ .. దేశంలో ఎవరిపై వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఆ ప్రాతిపదికనే దేశం ముందుకు కదులుతోంది. ప్రతి వ్యక్తికి రాజ్యంగపరమైన హక్కులు లభిస్తున్నాయి. భవిష్యత్ ‌పై భరోసాతో దేశం ముందుకు కదులుతోంది. ఈ దేశంలో మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతూ, సమాన గౌరవం పొందుతూ తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు అని తెలిపారు. సబ్ ‌కా సాత్, సబ్ ‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే మంత్రం దీని వెనుక ఉంది అని అన్నారు.