Begin typing your search above and press return to search.
ఇందుకే కౌన్సిల్ ను జగన్ రద్దు చేయాలనుకున్నది
By: Tupaki Desk | 3 Dec 2020 6:15 AM GMTఇటువంటి కారణాల వల్లే జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్లున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా మండలిలో తమకు బలం ఉందన్న ఏకైక కారణంతో టీడీపీ కొన్ని బిల్లులను అడ్డుకుంటోంది. మెజారిటి కారణంగా ఇపుడు అడ్డుకుంటున్న బిల్లులను కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీలో రెండోసారి ప్రవేశపెట్టి మండలితో సంబంధం లేకుండానే బిల్లులను ఆమోదింపచేసుకునే అవకాశం ఉందని టీడీపీకి బాగా తెలుసు. అయినా సరే మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకుంటున్నామన్న ఏకైక ఆనందంతోనే పాస్ కాకుండా అడ్డుకుంటోంది.
తాజాగా అసెంబ్లీ ఆమోదించిన పురపాలక చట్టాల సవరణ బిల్లు మండలిలో వీగిపోయింది. ఈ బిల్లు ఉద్దేశ్యం ఏమిటంటే మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్నును పెంచటమే. ప్రస్తుతం ఆస్తిపన్ను వసూలు ద్వారా ఏడాదికి ప్రభుత్వానికి రూ 1242 కోట్ల వసూలవుతోంది. అయితే ప్రభుత్వం సవరించిన తాజా చట్టం అమల్లోకి వస్తే అదనంగా మరో రూ. 186 కోట్లు పెరుగుతుంది. ఇదే విషయాన్ని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పారు.
అయితే ఈ బిల్లును ఆమోదించటానికి టీడీపీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. టీడీపీ సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతు ప్రభుత్వం చెప్పినట్లుగా వచ్చే అదనపు ఆదాయం రూ. 186 కోట్లు కాదన్నారు. తమ లెక్కల ప్రకారం సుమారు వెయ్యి కోట్లు ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. అంత భారం ప్రజలకు పడుతుంది కాబట్టి ఈ బిల్లుకు తాము అభ్యంతరం చెబుతున్నామన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా పెరగబోయే భారం రూ. 186 కోట్లే అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించచ్చు కదా అంటు ప్రశ్నించారు.
సరే చర్చ తర్వాత ఇదే విషయమై సభలో ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 11 ఓట్లు పడితే వ్యతిరేకంగా 29 ఓట్లు రావటంతో బిల్లు మండలిలో వీగిపోయింది. అంటే ఈ బిల్లుకు చట్టం రూపం వచ్చి ఆచరణలోకి రావాలంటే ప్రభుత్వం బిల్లును రెండోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిందే. దీనివల్ల మహా అయితే మరో నెల రోజులు ఆలస్యమవుతుందంతే. ఇక్కడ విషయం ఏమింటటే ఈ విషయం తెలిసి కూడా టీడీపీ బిల్లును అడ్డుకోవటమే. కారణం ఏమిటంటే జగన్ పై కోపంతో+మండలిలో తమకు మెజారిటి ఉందన్న ఏకైక కారణంతోనే మండలిలో బిల్లును ఓడించింది.
ఇటువంటి అనేక బిల్లులను తమ హయాంలో బలం ఉందన్న ఏకైక కారణంతో మండలిలో టీడీపీ ఆమోదించుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఆస్తిపన్ను పెరిగితే భారం ప్రజలపై పడుతుంది. దాని వల్ల నష్టం ఏదైనా జరిగితే అది అధికార వైసీపీకే కానీ టీడీపీకేమీ సంబంధం లేదు. అయినా కానీ బిల్లును తిరస్కరించిందంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులను తిరస్కరించటమే టార్గెట్ గా పెట్టుకున్నది టీడీపీ.
గతంలో సీఆర్డీయే చట్టం రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లులను కూడా టీడీపీ మండలిలో అడ్డుకున్న విషయం తెలిసిందే. అందుకనే అప్పట్లో అసలు మండలి అవసరమే లేదని జగన్ నిర్ణయానికి వచ్చి రద్దుకు సిఫారసు చేసింది. మండలి రద్దుకు సిఫారసు చేసినపుడేమో రద్దు చేయకూడదంటూ టీడీపీ అప్పట్లో తెగ బాధపడిపోయింది. పోనీ తర్వాతైనా తన పద్దతి మార్చుకున్నదా అంటే లేని తాజాగా జరిగిన పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.