Begin typing your search above and press return to search.
అమిత్ షా ట్విట్టర్ ఖాతా బ్లాక్ అవడానికి కారణం అదే!
By: Tupaki Desk | 22 Jan 2021 5:55 AM GMTగత గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయింది. ఇది సంచలనంగా మారింది. గురువారం రాత్రి అమిత్ షా ఖాతా నుంచి ప్రొఫైల్ చిత్రం మాయమై పోయింది. ఆయన ఖాతా ప్రొఫైల్ చిత్రం స్థానంలో ఈ చిత్రం కనబడటం లేదు అని రాసి ఉంది.సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ల దుర్వినియోగం నిరోధించడం, డిజిటల్ స్పేస్ లో మహిళల భద్రత ఎజెండాపై గురువారం ట్విట్టర్,ఫేస్ బుక్ భారత ప్రతినిధులు పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులు హోంమంత్రి ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారంటూ వారిని ప్రశ్నించారు. అమిత్ షా పోస్ట్ చేసిన ఓ చిత్రంపై కాపీ రైట్ ఉండటంతో నవంబర్లో ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపినట్లు ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఆ తరువాత బ్లాక్ చేసినట్లు వివరించారు. వెంటనే తమ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంటామని ప్రస్తుతం ఆయన ఖాతా పూర్తిస్థాయిలో పని చేస్తుందని వారు వివరణ ఇచ్చారు.
ఆయన ప్రొఫైల్ చిత్రంపై తనకు కాపీరైట్లు ఉన్నట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఖాతాను అన్ బ్లాక్ చేశామని వారు తెలిపారు. గ్లోబల్ కార్పొరేట్ విధానాల వల్ల అమిత్ షా ఖాతాను నిలిపి వేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత వెంటనే తమ తప్పు సరిదిద్దు కున్నామని అధికార ప్రతినిధి తెలిపారు. కాగా అమిత్ షా ఖాతా స్తంభింప చేయడం పట్ల ట్విట్టర్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.