Begin typing your search above and press return to search.

ములాయం తీరని కోరిక అదేనట

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:55 PM GMT
ములాయం తీరని కోరిక అదేనట
X
ఆయన ఇప్పటికి యాభై అయిదేళ్ళ క్రితమే చట్టసభలలో ప్రవేశించిన వారు. 1867లో తొలిసారి ఆయన ఎమ్మెల్యే గా అయ్యారు. అంతకు ముందు టీచర్ గా పనిచేసిన ములాయం రాజకీయాల పట్ల ఆసక్తితో అందులో ప్రవేశించారు. సోషలిస్ట్ భావాలు కలిగిన ఆయన అనతికాలంలోనే యూపీ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయనే ములాయం సింగ్ యాదవ్. ఆయన మూడు సార్లు అతి పెద్ద యూపీకి సీఎం గా పనిచేశారు. కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖను చేపట్టారు. అనేక సార్లు ఎంపీగా నెగ్గారు.

ఇవన్నీ ఇలా ఉంటే ములాయం సింగ్ 1989లో ఫస్ట్ టైమ్ కాంగ్రెస్ ని యూపీ లో గద్దె దించి అధికారం సంపాదించారు. ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన జాతీయ రాజకీయాలలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. అప్పట్లో 1990లలో భారత దేశాన మందిర్ మండల్ వివాదం నడుస్తోంది. బీజేపీ అగ్ర నేత అద్వానీ రధయాత్ర మొదలైంది. దాన్ని యూపీ దాకా రానీయనని అడ్డుకుంటామని ములాయం భీషణ ప్రతిన చేశారు. కరసేవలక మీద ఆయన కాలుపు జరిపించి కరడుకట్టిన లౌకికవాది అనిపించుకున్నారు.

ఈ నేపధ్యంలో జాతీయ రాజకీయాల్లో అప్పట్లో ఏర్పడిన శూన్యతను పూరించందుకు ములాయం కి ఒక చాన్స్ వచ్చింది. 1996లో బీజేపీకి కాంగ్రెస్ కు 141, బీజేపీకి 161 సీట్లు దక్కాయి. అపుడు యునైటెడ్ ఫ్రంట్ ద్వారా దేవేగౌడ తొలి ప్రధాని అయ్యారు. ఆయన పదకొండు నెలలకే దిగిపోయారు. కాంగ్రెస్ అభీష్టం మేరకు ఆయన్ని అలా మార్చాల్సి వచ్చింది. దాంతో కొత్త ప్రధాని ఎవరు అన్న చర్చలు జరుగుతున్నపుడు రేసులో చాలా ముందుకు దూసుకువచ్చారు ములాయం సింగ్ యాదవ్.

ఆయనకు సీపీఎం జాతీయ ప్రధాన కార్దర్శి హరికిషన్ సింగ్ సూర్జీత్ మద్దతు లభించింది. ఈ నేపధ్యంలో సౌత్ నుంచే గట్టి పోటీ వచ్చింది. తమిళ మనీల కాంగ్రెస్ నేత జీకే ముపనార్ కూడా ప్రధాని కోసం ముందుకు వచ్చారు. అపుడు ఆయనకు ములాయం మధ్య ఒక స్థాయిలో పోటీ జరిగింది, అలా యునైటెడ్ ఫ్రంట్ లోని భాగస్వాముల మధ్య జరిగిన అంతర్గత ఓటింగ్ లో 120 మంది ఎంపీలు మొగ్గు చూపారు. కానీ ఆయన ప్రధాని పదవికి మోకాలడ్డింది మాత్రం బీహార్ సీఎం గా నాడు ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనతో పాటు మరో కీలక నేత శరద్ యాదవ్ అని చెబుతారు.

ఆ ఇద్దరూ ఎందుకో ములాయం సింగ్ పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు అని ప్రచారంలో ఉన్న మాట. ఆ సమయంలో ఏపీకి సీఎం గా ఉంటూ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చక్రం తిప్పిన చంద్రబాబు సైతం ములాయం పీఎం క్యాండిడేచర్ మీద పెద్దగా ఇష్టపడలేదని చెబుతారు. ఒక దశలో చంద్రబాబు పేరు కూడా ప్రధాని పదవికి వచ్చినా ఆయన నో చెప్పేశారు. కానీ ములాయం కి కూడా పడనివ్వలేదు అని అంటారు.

ఆ విధంగా కీలక నేతల మద్దతు లేకపోవడంతో ములాయం కి ప్రధాని అయ్యే చాన్స్ తప్పిపోయింది అని అంటారు. నిజానికి జాతీయ రాజకీయాల్లో రాణించాలని ములాయం చాలానే ప్రయత్నం చేశారు. ఆయన తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ని యూపీకి ముఖ్యమంత్రిని చేశారు. అలా తాను జాతీయ రాజకీయాల్లో వెలగాలని అనుకున్నారు. కానీ 1999 తరువాత దేశ రాజకీయాలు మారిపోయాయి. అయితే ఎన్డీయే లేక యూపీయే కూటములే అధికారంలోకి వచ్చాయి. దాంతో ములాయం కోరిక తీరలేదు.

ఇక 2024లో మాత్రం మరోసారి సంకీర్ణ రాజకీయాలు తెర లేస్తుంది అని అంతా భావిస్తున్న సమయంలో ఆరోగ్యం సహకరించక ములాయం ఏకంగా ఈ లోకాన్ని వీడిపోయారు. మొత్తానికి ములాయం యూపీకి మంచి సీఎం గా పనిచేశారు, దేశ రాజకీయాల్లో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయారు అనే సన్నిహితులు అంటారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.