Begin typing your search above and press return to search.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ హాట్ బ్యూటీ !
By: Tupaki Desk | 3 April 2021 7:00 PM ISTసినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న ఎంతోమంది నటీనటులు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు కొత్త రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తే.. మరికొందరు అప్పటికే ఉన్న పార్టీల్లో చేరి , పార్టీ టికెట్ సాధించి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్ ,హాట్ బ్యూటీ రాజకీయ అరంగేట్రం కి సిద్ధమైంది.
అయితే, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో కాదు. తాను పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఆ ప్రాంతాన్ని బాగుచేయాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమైంది. ఆమె మరెవరో కాదు .. 2015 మిస్ ఇండియా రన్నరప్, మోడల్, బ్యూటీ క్వీన్ దీక్షా సింగ్. బక్షా ఏరియా చిట్టోరి గ్రామానికి చెందిన దీక్షా సింగ్ చిన్నతనంలో అక్కడే పెరిగింది. ఆ తరువాత తండ్రి వ్యాపార రీత్యా ముంబై, అక్కడి నుంచి గోవాలో స్థిరపడింది. మోడల్‌గా ఎదిగిన దీక్షా 2015లో మిస్ ఇండియా కాంపిటేషన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన అందాల రాణి దీక్షా సింగ్ , పంచాయతీ ఎన్నికల ద్వార రాజకీయ అరంగేట్రం చేయాలని నిర్ణయం తీసుకుందట. ఉత్తరప్రదేశ్ , జాన్పూర్ జిల్లా, బక్షా డెవెలప్ మెంట్ బ్లాక్, వార్డ్ నంబర్ 26 నుంచి దీక్షా ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతోంది.
అసలు చడీ చప్పుడు లేకుండా ఏంటి ఈ రాజకీయ అరంగేట్రం , అసలు ఈ హాట్ బ్యూటీ కి పాలిటిక్స్‌పై ఇంత ఆసక్తి ఎందుకు వచ్చిందంట ఇదే స్థానం నుంచి ఆమె తండ్రి పోటీ చేయాలి అనుకున్నారు. అయితే , ఈసారి ఆ సీటు మహిళలకు రిజర్వ్ అయ్యింది. దాంతో ఈ ముద్దుగుమ్మ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా ప్రాంతం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది దీక్సా సింగ్. హాట్ బ్యూటీ కదా ఎన్నికల బరిలో నిలిస్తే విజయం తథ్యం అని అనుకుంటే పొరపాటే , ఎందుకంటే ఆమెకు పోటీగా బీజేపీ నుంచి రామ చంద్ర సింగ్ కోడలు షాలినీ సింగ్ బరిలో దిగుతోంది. మొత్తంగా దీక్షా ఎంట్రీతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ పంచాయతీ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఈ నెల 15 నుంచి యూపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.