Begin typing your search above and press return to search.
స్టేట్ టాపర్స్ కి కార్లు బహుమతిగా ఇచ్చిన ఆ ప్రభుత్వం !
By: Tupaki Desk | 24 Sep 2020 12:30 PM GMTవిద్యార్ధులకి మంచి ప్రోత్సహాహలు ఇస్తే, చదువుపై ఇంకా ఎక్కువ దృష్టి పెడతారని భావించిన ఆ ప్రభుత్వం..స్టేట్స్ టాపర్లకి ఏకంగా కార్లు బాహుమతిగా ఇచ్చింది. 10, 12వ తరగతి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి కార్లను బహుమతిగా ఇచ్చారు. జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచిన స్టూడెంట్స్ కు ప్రోత్సాహకంగా జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో బుధవారం కార్లను బహుమతిగా అందజేశారు.
చదువు పై ఇష్టంతో, కష్టపడి చుదువుకుని మంచి మార్కులు సాధించిన టాపర్ల శ్రమను ప్రభుత్వం గుర్తించి, ఇంకా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నామని పొగడ్తలు కురిపిస్తూ, రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జార్ఖండ్ విద్యా మండలి కార్లను బహుమతిగా ఇచ్చింది. కాగా మెట్రిక్యులేషన్ ఫలితాలు విడుదల కాకముందే మంచి ర్యాంక్ సాధించినవారికి కార్లను బహుమతిగా ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. సెప్టెంబర్ 18 న టాపర్స్ పేర్లు ప్రకటించగా వారి మార్క్స్ పేపర్స్ వచ్చిన తరువాత వారికి కార్లను గిఫ్టుగా ఇచ్చారు.
ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో అమిత్ కుమార్ 500ల మార్కులకు 91.4 శాతంతో 457 మార్కులతో 12 వ తరగతిలో అగ్రస్థానంలో నిలవగా, మనీష్ కుమార్ కటియార్ 98 శాతంతో 457 మార్కులతో 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చదువులో విద్యార్దులకు ప్రోత్సహించటానికి ఇలా వారికి కార్లు గిఫ్టుగా ఇచ్చామని తెలిపారు. టాపర్లుగా నిలిచిన విద్యార్దులకు వారి ఉన్నత చదువుల కోసం తాము ఆర్థికంగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 75% మార్కులు సాధించిన విద్యార్థులకు పలువురు విద్యార్ధులకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చారు.