Begin typing your search above and press return to search.

సామాన్యులకి మరో షాక్ .. పెరిగిన పాల ధర .. ఎంతంటే

By:  Tupaki Desk   |   3 April 2021 6:30 AM GMT
సామాన్యులకి మరో షాక్ .. పెరిగిన పాల ధర .. ఎంతంటే
X
సామాన్యులకి మరో భారీ షాక్. నిన్న మొన్నటి వరకు వంట గ్యాస్, ఇంధన ధరల పెంపుతో బెంబేలెత్తిపోయిన సామాన్య , మధ్యతరగతి వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో పాల ధర కూడా తాజాగా పెరిగిపోయింది. తేల్లారితే చాలు... అన్నీ ధరల పెంపు వార్తలే..మన జీతాలు, వేతనాలు మాత్రం పెరగవు అని సామాన్యుల ఆవేదన చెందుతున్నారు. ఇది నిజమే అని చెప్పాలి. ఈ రోజుల్లో చాలా నిత్యువసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. కరోనా వైరస్ విజృంభణ సమయంలో కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు ధరలను పెంచి అమ్మారు. ఇప్పుడు లాక్ ‌డౌన్ అమల్లో లేకపోయినా కూడా అలాగే పెంచిన ధరలకు అమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్రెడీ ఆకాశంలో ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పటికే ఎక్కువగా ఉన్న పాల ధరలు మరింత పెరిగాయి.

విశాఖ డెయిరీ యాజమాన్యం పాల ధరను పెంచింది. శనివారం నుంచి లీటరుకు రూ. 2 రూపాయలు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. యాజమాన్యం చెప్పినదాన్ని బట్టి ఇప్పటివరకు హోమోజినైజ్డ్‌ డబుల్‌ టోన్డు పాలు అర లీటరు ధర 21 రూపాయలుండగా తాజాగా పెరిగిన ధరని బట్టి చూస్తే..22 రూపాయలు కానున్నది. అలాగే టోన్డు పాలు అర లీటరు ధరను రూ.23 నుంచి రూ.24కు, స్టాండర్డజ్డ్‌ పాలు ధర రూ.25 నుంచి రూ.26కు, పుల్‌ క్రీము పాలు రూ.27 నుంచి రూ.28కు, హోమోజినైజ్డ్‌ టోన్డు పాలు అర లీటరు ధర రూ.24 నుంచి రూ.25కు, హోమోజినైజ్డ్‌ ఆవు పాలు 200 ఎంఎల్‌ 11 రూపాయల నుంచి 12 రూపాయలకు, హోమోజినైజ్డ్‌ డబుల్‌ టోన్డు పాలు అర లీటరు రూ.22 నుంచి రూ.23కు పెంచింది. విశాఖ డెయిరీ యాజమాన్యం రోజుకు సుమారు ఆరు లక్షల లీటర్లు పాలు విక్రయిస్తుంది. ఆ లెక్కన చూస్తే వినియోగదారులపై రోజుకు సుమారు 12 లక్షల రూపాయలు అదనపు భారం పడనున్నది. ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు, ప్యాకింగ్‌ ధరలు, నిర్వహణ, కూలీల ఛార్జీలు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి ఒకటిన పాల ధరలను లీటరుకు రెండు రూపాయలు పెంచిన డెయిరీ యాజమాన్యం ఏడాదికే మళ్లీ రెండు రూపాయలు పెంచడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ మన వేతనాలు పెంచుతూ పొతే కొద్దిరోజుల్లోనే తినడానికి తిండి కూడా దొరకని రోజు అంటూ వస్తుంది అని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపి సామాన్య ప్రజానీకానికి ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి అని కోరుతున్నారు.