Begin typing your search above and press return to search.

అగ్నిపర్వతాల నుంచి బిట్ కాయిన్ .. క్రిప్టోకరెన్సీపై ఆ దేశం అద్భుతం

By:  Tupaki Desk   |   2 Oct 2021 11:30 PM GMT
అగ్నిపర్వతాల నుంచి బిట్ కాయిన్ .. క్రిప్టోకరెన్సీపై ఆ దేశం అద్భుతం
X
బిట్ కాయిన్, ఇది ఒక్కటి ఉంటే చాలు. మీరు లక్షాధికారే. ఓ 10 ఉంటే కోటీశ్వరుడయినట్లే లెక్క. అవును మరీ, దీని విలువు మామూలుగా లేదు. ఒక్క బిట్ కాయిన్ విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. అందుకు చాలా రోజులుగా ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది. క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌ లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్‌ సాల్వడర్‌, అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌ తో బిట్‌ కాయిన్‌ తయారు చేసిన ఘనత దక్కించుకుంది.

తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. జియోథర్మల్‌ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్‌ ఎనర్జీని డిజిటల్‌ ఎనర్జీగా (బిట్‌ కాయిన్‌) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్‌ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్‌ లో బిట్‌ కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్‌ బుకెలె శుక్రవారం ట్విటర్‌ ద్వారా చూపించారు.

సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ(కంప్యూటర్‌ ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌ సాల్వడర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్‌ సేవ్‌ కావడమే కాదు.. జియోథర్మల్‌ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది.

బిట్‌ కాయిన్‌ క్రిప్టోకరెన్సీకు ఎల్‌ సాల్వడర్‌ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌ కాయిన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌ సాల్వాడర్‌ సర్కార్‌ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్‌ కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు. బిట్‌ కాయిన్‌ కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్‌ మొదటి వారంలో బిట్‌ కాయిన్‌ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్‌ సాల్వడర్‌ ప్రభుత్వం తగ్గడం లేదు.

2009లో బిట్‌ కాయిన్‌ ను సృష్టించినప్పుడు, ఒక బ్లాక్ మైనింగ్ చేసిన మైనర్‌ కు 50 బిట్‌కాయిన్ లభించేవి. 2012లో ఇది 25 బిట్‌ కాయిన్‌ లకు పడిపోయింది. మైనింగ్‌ రివార్డులను ప్రతి నాలుగు సంవత్సరాలకు సగానికి తగ్గించాలని బిట్‌ కాయిన్ ప్లాట్‌ ఫాం నిర్ణయించడమే ఇందుకు కారణం. గత ఏడాది మేలో, బిట్‌ కాయిన్‌ కు ఒక బ్లాక్‌ ను జోడిస్తే అందే రివార్డు 6.25 బిట్‌ కాయిన్‌ గా ఉంది. ఒక బిట్‌ కాయిన్ విలువ ఇప్పుడు సుమారు 40,000 డాలర్లుగా ఉంది. అంటే మైనింగ్ ద్వారా ఒక బ్లాక్‌ ను బిట్‌ కాయిన్‌ కు యాడ్ చేస్తే.. ఇప్పటికీ మైనర్లు పెద్ద మొత్తంలో రివార్డు గెల్చుకోవచ్చు