Begin typing your search above and press return to search.

70 ఏళ్లుగా ఆ కేసు పెండింగ్ లో ఉంది... హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు!

By:  Tupaki Desk   |   25 Jan 2021 11:00 PM IST
70 ఏళ్లుగా ఆ కేసు పెండింగ్ లో ఉంది... హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు!
X
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నవాబు వారసత్వానికి సంబంధించిన కేసును త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు కి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయయూర్తి ఎస్‌.ఎ.బోబ్డే సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసు 70 ఏళ్లుగా హైకోర్టులో పెండింగ్ ‌లో ఉంది. ఈ విషయమై సయ్యద్‌ జహీద్‌ అలీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కింది కోర్టుల్లో మూడు నిర్ణయాలు తనకు అనుకూలంగా వచ్చాయని ఆయన కోర్టుకు తెలిపారు. సాలార్‌ జంగ్‌ వారసుడిగా సయ్యద్ ‌ను ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. ఆస్తిని అప్పగించే విషయంలో ఒక కోర్టు తీర్పు స్పష్టంగా ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. సయ్యద్‌ ను వారసుడిగా తెలిపే అధికార పత్రం సైతం ఇచ్చినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఈ విషయంలో సయ్యద్ జాహిద్ అలీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనేక లేఖలు రాసినట్లు తెలిపారు. అయితే హోం మంత్రిత్వ శాఖ నుంచి ఒక్క లేఖకు కూడా సమాధానం రాలేదని కోర్టు ఎదుట సయ్యద్ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసినప్పటి నుంచి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని న్యాయవాది వివరించారు .