Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ ఎంపీ అమరావతి నుంచి ఔట్.. హైదరాబాద్ లో ఇన్!

By:  Tupaki Desk   |   20 Aug 2020 1:00 PM GMT
ఆ బీజేపీ ఎంపీ అమరావతి నుంచి ఔట్.. హైదరాబాద్ లో ఇన్!
X
టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన పొలిటికల్ లాబీయిస్ట్ మరియు కేంద్ర మాజీ మంత్రి అయిన సుజనా చౌదరి ఇప్పుడు అమరావతి నుంచి దుకాణం సర్దేశాడట.. సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయిన తరువాత టీడీపీ నాయకులను కాపడుతూ వస్తున్నాడని.. దాని వెనుక కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అందుకే ఏపీలో బీజేపీ బలోపేతం కాకుండా పోతోందని వైసీపీ వర్గాలు ప్రతీరోజు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించాయి. కన్నా, సుజనా తెరవెనుక మంత్రాంగం వల్లే బీజేపీకి ఈ పరిస్థితి అని రాసుకొచ్చాయి. దీంతో అధిష్టానం దృష్టిలో వీరిద్దరూ విలన్స్ గా మారిపోయారు.

అందుకే కన్నాను దించేసిన బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేసింది. కాపు కమ్యూనిటీ కావడం.. జనసేనతో బాగా సంబంధాలున్న వ్యక్తి సోము వీర్రాజు కావడంతో బాధ్యతలు చేపట్టగానే పని మొదలుపెట్టాడట..

సుజనాచౌదరిని ఏపీ నుంచి తరిమేయాలని ఫిక్స్ అయిన సోము వీర్రాజు.. ఢిల్లీ పెద్దల దగ్గర ఏపీలో బీజేపీ బలపడాలంటే టీడీపీని కిల్ చేయాలని.. అప్పుడే బీజేపీ బలపడుతుందని స్పష్టం చేశాడట.. ఆ తరువాత వైసీపీని టార్గెట్ చేద్దామని తన ప్రణాళికలను అదిష్టానం ముందు ఉంచాడట..

అయితే ఇదంతా అమలు కావాలంటే పొలిటికల్ లాబీయిస్ట్ అయిన సుజనా చౌదరి లాంటి వాళ్లు ఏపీ బీజేపీలో ఉండకూడదని.. ఆయన ఎలాంటి వేలు పెట్టకుండా చూడాలని.. ముఖ్యంగా సుజనాను అమరావతి మీద మాట్లాడకుండా చూడాలని బీజేపీ పెద్దలను కోరాడట.. సుజనాను తెలంగాణ బీజేపీలోకి పంపేయాలని సోము వీర్రాజు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. అదే సరైన మార్గమని భావించిన బీజేపీ.. సీరియస్ గా సుజనాను తెలంగాణ బాధ్యతలే చూడాలని చెప్పబోతోందనే టాక్ బీజేపీ వర్గాల్లో నడుస్తోంది.