Begin typing your search above and press return to search.
అమెరికాతో పెట్టుకుంటే అంతే.. ఒక డాలర్ కు 6 లక్షల రియాల్స్!
By: Tupaki Desk | 27 Feb 2023 6:00 PM GMTప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాతో పేచీ అంటే మాటలు కాదు. తట్టుకొని నిలవటం చాలా కష్టం. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడే కష్టనష్టాలకు దేశం ఏదైనా చిగురుటాకులా వణికిపోతుంది. అందుకే.. పెద్దన్నతో పెట్టుకోవటానికి అంత ఆసక్తి చూపరు. గడిచిన కొన్నేళ్లుగా అమెరికా - ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా అడుగంటిపోవటం తెలిసిందే. ఇరాన్ సంగతి చూడాలన్న పట్టుదల అగ్రరాజ్యానికి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఇలాంటి వేళలో.. ఇరాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతోంది. తాజాగా అమెరికా ఒక డాలర్ కు ఇరాన్ కరెన్సీ రియాల్ ఏకంగా 6 లక్షలకు దిగిపోవటం చూస్తే.. ఆ దేశ కరెన్సీ ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. రోజు రోజుకు దారుణంగా పడిపోతున్న కరెన్సీతో ఇరాన్ బెంబేలెత్తుతోంది.
2015లో ఇరాన్ కరెన్సీ విలువ ఒక అమెరికన్ డాలర్ తో పోలిస్తే 32 వేల రియాల్స్ కు ఉండేది. అదిప్పుడు 6 లక్షల రియాల్స్ కు పడిపోవటం గమనార్హం. 1979లో ఇస్లామిక్ విప్లవ వేళలో ఒక డాలర్ కు 100 రియాల్స్ ఉన్న ఆ దేశ కరెన్సీ.. తాజా పతనం చూస్తే.. ఎన్ని లక్షల రెట్లకు పడిపోయిందో అర్థమవుతుంది. 2015లో జరిగిన న్యూక్లియర్ ఒప్పందం తర్వాత ఆ దేశం మీద ఉన్న అంతర్జాతీయ అంక్షల్ని ఎత్తేశారు. ఆ సమయంలో ఇరాన్ రియాల్స్ విలువ భారీగా ఉంటే.. ఇటీవల కాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఆ దేశంలో హిజాబ్ వ్యతిరేకత ఆందోళనలు ఎక్కువ కావటంతో ప్రాశ్చాత్య దేశాల ఆంక్షలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లోనే ఒక డాలర్ మీద లక్ష రియాల్స్ వరకు పడిపోవటం గమనార్హం. గత ఆగస్టులో ఒక డాలర్ కు 3 లక్షల రియాల్స్ ఉండగా..
ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి 5 లక్షల రియాల్స్ కు పడిపోయింది. తాజాగా మరింతగా దిగజారి 6 లక్షల రియాల్స్ తో కనిష్ఠానికి చేరింది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం కూడా గరిష్ఠానికి చేరుకుంది. 2021 జనవరిలో 41.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 53.4 శాతానికి చేరినట్లుగా అక్కడి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే..రానున్న రోజుల్లో ఇరానీయులు మరింత గడ్డుపరిస్థితులు ఎదుర్కొక తప్పదన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.